బడ్జెట్‌పై చర్చ పక్కదారి

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, వ‌రుదు క‌ళ్యాణి

తాడేప‌ల్లి : బడ్జెట్‌పై చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. మండలిలో మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే అడ్డు తగులుతున్నారని ఎమ్మెల్సీలు ఫైర్ అయ్యారు. ఏపీ శాసన మండలి మీడియా పాయింట్‌ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, వ‌రుదు క‌ళ్యాణి, ఇశ్రాయేలు మాట్లాడారు. ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామని ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టారని ధ్వజమెత్తారు. రూ.5,387 కోట్లు ఇస్తే తల్లికి వందనం ఎలా అమలు చేస్తారు? అని ప్రశ్నించారు.

పవర్ సెక్టార్‌పై చర్చ జరగకుండా చేశారు. పలు సమావేశాల్లో కరెంట్ ఛార్జీలు పెంచనని చంద్రబాబు చెప్పారు. ఒక్క రూపాయి ఛార్జీ పెంచనని చెప్పి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు. తమ మోసాన్ని ప్రజలకు తెలియకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నార‌ని తోట త్రిమూర్తులు  అన్నారు. లోకేష్ సందర్భం లేని చర్చను తెరపైకి తెచ్చారు. బడ్జెట్ పై వరుదు కళ్యాణి మాట్లాడుతుంటే మా తల్లిని అవమానించారంటూ లోకేష్ చర్చను తప్పుదారి పట్టించారు. గతంలో ఎప్పుడూ లేని పరిస్థితులను సభలో చూస్తున్నాం. సోషల్ మీడియై పోస్టులపై చర్చకు కోరితే అడ్డుకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియకూడదనే టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్నారు. సూపర్ సిక్స్‌లు అమలు చేయకుండా కూటమి నేతలు ప్రజలను మోసం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది: వరుదు కల్యాణి
ప్రశ్నిస్తే గొంతును నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటివరకు ఇవ్వలేదు. రైతులకు కేటాయించిన రూ.వెయ్యి కోట్లు ఎప్పుడిస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా వైయ‌స్ జగన్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం విధ్వంసమంటారా?. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పోర్టులు కట్టడం చీకటి పాలన అవుతుందా?. ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ను మంత్రులు దెబ్బతీయాలని చూస్తున్నారు.

 

Back to Top