పంటల బీమాపై మాట్లాడే హక్కు టీడీపీకి లేదు

 వైయ‌స్ఆర్‌సీపీ వ్యవసాయ విభాగం అధ్యక్షుడు, ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ ఎం.వి.ఎస్‌.నాగిరెడ్డి ఫైర్‌

తాడేప‌ల్లి: రైతులను నిండా మంచిన చంద్రబాబుగారి ప్రభుత్వం మాపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ వ్యవసాయ విభాగం అధ్యక్షుడు, ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ ఎం.వి.ఎస్‌.నాగిరెడ్డి ఫైర్‌
అయ్యారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రైతులకు పంటల బీమాపై ఇవాళ లోక్‌సభలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ ప్రకటనలో పూర్తి వివరాల్లేవు. దాన్ని పట్టుకుని వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ విష ప్రచారం చేస్తోంది.

  • రైతులకు ఉచిత పంటల బీమాను అందించిన ఘనత వైయ‌స్ఆర్‌సీపీదే.
  • రైతులను ఆదుకోవడానికి పంటల బీమాకోసం సొంతంగా ఇన్సూరెన్స్‌ కంపెనీ ఏర్పాటుకు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది.
  • అలా చేస్తే ఫసల్‌ బీమా ఇవ్వబోమన్న అప్పటి కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు.
  • కేంద్రం వాటా లేకుండానే రెండేళ్ల పాటు సమర్థవంతంగా  వైయస్‌.జగన్‌ ప్రభుత్వం అమలు చేసింది. 
  • 2014-19 మధ్య రైతులే పంటల బీమా ప్రీమియంను కట్టుకోవాలి. అప్పుడు ఇన్సూరెన్స్‌ పరిధిలో 30.85 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఆ ఐదేళ్లలో రైతులకు చెల్లించింది కేవలం రూ.3,411.2 కోట్లు మాత్రమే.
  • 2019-23 మధ్య ఉచిత పంటల బీమా పరిధిలోకి 54.55 లక్షల మంది రైతులు, బీమా కింద రూ.7,802.5 కోట్లు చెల్లింపు. ప్రీమియం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. 
  • రైతులకు మెరుగైన లబ్ధి చేకూరడంపై నాటి వైయస్‌.జగన్‌ ప్రభుత్వం చేపట్టిన విధానాలపై నాటి కేంద్రం మళ్లీ ఆసక్తి చూపింది.
  • ఫసల్‌ బీమా యోజను వైయస్సార్‌ పంటల బీమాలో మిళితం చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఆమేరకు గత ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో కేంద్ర వ్యవసాయశాఖ అధికారులు మంతనాలు జరిపారు. 
  • కేంద్ర ప్రభుత్వ సూచనతో వైయస్సార్‌ ఉచిత పంటపల బీమాలో ఫసల్‌ బీమా యోజనను మిళితం చేశాం. 
  • ఈమేరకు అప్పటి సీఎం జగన్‌గారితో ఆనాటి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.
  • జులై 12, 2022న పీఐబీ ప్రకటనే దీనికి నిదర్శనం.
  • ఈరోజు లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటనలో పంటల బీమా విషయంలో కేంద్ర ప్రభుత్వం, వైయ‌స్ఆర్‌సీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంమీద ఏం జరిగిందన్నదానిపై పూర్తి వివరాల్లేవు.
  • పూర్తివివరాలు లేకపోవడంతో దాన్ని పట్టుకుని ఎల్లోమీడియా తప్పుడు ప్రకటనలు, విష  ప్రచారాలు చేస్తోంది. 
  • చంద్రబాబు గారు మళ్లీ సీఎం అయిన తర్వాత ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టారు.
  • 2023-24 ఏడాదికి ఇన్సూరెన్స్‌ ప్రీమియంను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు.
  • 2024లో జూన్‌లో చెల్లించాల్సిన ప్రీమియం డబ్బును చెల్లించకుండా చంద్రబాబు ఎగ్గొట్టారు. తద్వారా లక్షలాది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు దాదాపుగా రూ.1,385 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బును నష్టపోయారు.
  • ఉచిత పంటల బీమాను ఎగ్గొట్టి చంద్రబాబు రైతుల పొట్టకొట్టారు. 
  • ఇప్పుడు బీమాకు మళ్లీ రైతుల నుంచే డబ్బు వసూలు చేస్తున్నారు.
  • పంటల బీమా వర్తించక లక్షల మంది రైతుల అగచాట్లు పడుతున్నారు.
  • ఎన్నికల వాగ్దానం ప్రకారం గత ఏడాది రైతు భరోసాను చంద్రబాబుగారు ఎగ్గొట్టారు
  • రూ.20 వేల ఇస్తానన్న మాట నిలుపుకోలేదు.
  • ఈ ఏడాది సీజన్‌ మొదలై చాలా కాలం అయినా రైతు భరోసా ఇవ్వవలేదు.
  • జూన్‌ 21న ఇస్తానన్నారు, ఇప్పటికీ అతీ గతీలేదు
  • మా హయాంలో ఐదేళ్లలో 53.58 లక్షల మంది రైతులకు రైతు భరోసాను సమయానికే అందించాం. మొత్తంగా రూ.34,228 కోట్లు రైతులకు అందించాం.
  • ఈ ప్రభుత్వంలో మొదట ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 
  • ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్యలోనూ కోత పెడుతున్నారు.
  • అదికూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు.
  • రైతులకు ఇంత అన్యాయంచేసి మాపై తప్పుడు ప్రచారాలు అత్యంత హేయం.
Back to Top