మూడవ దశ వైయస్‌ఆర్‌ కంటి వెలుగు ప్రారంభం

కర్నూలు: మూడవ దశ వైయస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో ప్రారంభించారు. ఎస్టీబీసీ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు స్టాల్‌ను సీఎం వైయస్‌ జగన్‌ పరిశీలించి అవ్వాతాతలతో ముచ్చటించారు. అంతేకాకుండా చిన్నారులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 56.88 లక్షల మంది అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు ఇవ్వడమే కాకుండా అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయించనున్నారు.

 

తాజా వీడియోలు

Back to Top