మ‌హానేత‌కు ఘ‌న నివాళి

క‌ర్నూలు వైయ‌స్ఆర్ సీపీ కార్యాల‌యంలో వైయ‌స్ఆర్ వ‌ర్ధంతి

నివాళుల‌ర్పించిన ఎమ్మెల్యేలు రాంభూపాల్‌రెడ్డి, హ‌ఫీజ్‌ఖాన్‌, మేయ‌ర్ బీవై రామ‌య్య‌

క‌ర్నూలు: దివంగత మ‌హానేత డాక్ట‌ర్ వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కర్నూలు నగరంలో వైయస్ఆర్ సిపి శ్రేణులు మ‌హానేత‌ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైయ‌స్ఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా పలు సేవలు కార్యక్రమాలు చేపట్టారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైయస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, మేయర్ బి.వై. రామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ సర్కిల్లో ఉన్నా వైయస్ఆర్ విగ్రహానికి వారు పూలమాలలు వేశారు. 28వ వార్డు పందిపాడులోని వైయస్ఆర్ విగ్రహానికి మేయర్ బి.వై. రామయ్య, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 200 మంది పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. 

కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు సిద్దారెడ్డి రేణుక, నాయకల్లు అరుణ, స్టాండింగ్ కమిటీ సభ్యులు వైజా అరుణ, సాన శ్రీనువాసులు, రాజేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్లు ఇప్పాల నారయణ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, సత్యనారాయణమ్మ, విక్రమసింహా రెడ్డి, కృష్ణకాంత్ రెడ్డి, శ్రీనివాసరావు (వాసు), చిన్న నర్సింహులు, దండు లక్ష్మికాంత రెడ్డి, జయరాముడు, వెంకటేశ్వర్లు, లక్ష్మి రెడ్డి, మిద్దె చిట్టెమ్మ, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర్ రెడ్డి, బిసి కార్పొరేషన్ డైరెక్టర్లు గోపాల్ రెడ్డి, కల్పన గౌరి, ఇలియాస్, తెలుగు అనిల్, పెద్దన్న, మోయీన్, బత్తుల లక్ష్మయ్య, పందిపాడు శివుడు మహిళా నాయకురాలు సుచరిత, విజయలక్ష్మి, చంద్రిక తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top