"వైయస్‌ఆర్‌ వాహన మిత్ర' సాయానికి ఉత్తర్వులు

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం కింద రూ.10 వేలు సాయం చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, యజమానులకు రూ.10 వేల ఆర్థిక సాయం కోసం రెండో విడతలో  2,36,344 మందికి ఆర్థికసాయం ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అర్హుల ఎంపికకు మరోమారు మార్గదర్శకాలు జారీ చేశారు. 8 కార్పొరేషన్ల ద్వారా నిధుల విడుదలకు ఆదేశాలు  ఇచ్చారు. జూన్‌ 4న నిధుల విడుదలకు ఆదేశాలు ఇచ్చారు.  ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 4న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఓనర్ కమ్ డ్రైవర్లు.. ఆటో మాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్లు సొంతంగా వాహనాలు కొనుక్కోని నడుపుకుంటూ.. వృత్తిగా జీవిస్తున్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించి లబ్దిదారుల దరఖాస్తు ప్రక్రియ మే 26 లోపు వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా పూర్తి చేస్తామని మంత్రి పేర్నినాని ఇదివరకే తెలిపారు.  ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గతేడాది లబ్దిపొందిన వారు మళ్లీ దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.   

Back to Top