వైయ‌స్‌ఆర్‌ సంపూర్ణ పోషణ – టేక్‌ హోం రేషన్‌ పంపిణీ ప్రారంభం

క్యాంపు కార్యాల‌యం నుంచి ప్రారంభించిన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: గర్బిణీలు, బాలింతలకు ఇచ్చే వైయ‌స్‌ఆర్‌ సంపూర్ణ పోషణ – టేక్‌ హోం రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు.పౌష్టికాహార ప‌దార్థాల‌తో కూడిన బ్యాగ్‌ను గ‌ర్భిణులు, బాలింత‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో మహిళాశిశు సంక్షేమశాఖమంత్రి కె.వి ఉషశ్రీచరణ్, సీఎస్‌ డాక్టర్ కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి, మహిళాశిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి జి. జయలక్ష్మి, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఫెడరేషన్‌ ఎండీ ఎ. బాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలికవసతులు కల్పన) కమిషనర్‌ కాటమనేని భాస్కర్, పౌరసరఫరాలశాఖ ఎండీ జి. వీరపాండ్యన్, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ కమిషనర్ జె. నివాస్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఎ. విజయ సునీత ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. 

తాజా వీడియోలు

Back to Top