శ్రీకాకుళం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజలకు ఆరాధ్య దైవంగా మారారు. సంక్రాంతి పండుగ వేళ ఆయన్ను గుర్తు చేసుకుంటూ దేవుళ్లతో సమానంగా పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు ఆయన వీరాభిమాని. పండగ వేళ తమ కుటుంబంలో కీర్తిశేషులు అయినటువంటి పెద్దలకు, పూర్వీకులకు కొత్త వస్త్రాలను సమర్పించి దేవుళ్లతో సమానంగా ఆరాధించడం ఆనవాయితీ. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం, రుషింగి గ్రామంలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ యలకల వాసునాయుడు దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి తమ పూర్వీకులతో పాటు నూతన వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం అనంతరం బ్రాహ్మణులకు వస్త్ర దానం చేశాడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా తమ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు లాంటివారిని, ఆయన్ను గుర్తించుకోవడం మా బాధ్యత అని వాసునాయుడు తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా ప్రతియేటా సంక్రాంతి రోజు వైయస్ఆర్‌కు ప్రత్యేక పూజలు చేసి, వస్త్రదానం చేస్తానని వాసు నాయుడు పేర్కొన్నారు.