రాబోయేది మా ప్రభుత్వమే..ఇంతకు ఇంతా చెల్లిస్తాం 

మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి వార్నింగ్‌

నెల్లూరు:  కూట‌మి ప్ర‌భుత్వంలో రోజు రోజుకు అరాచ‌కాలు అధిక‌మ‌య్యాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మా ఇంటిపై దాడి చేయ‌డ‌మే కాకుండా మాపైనే రివ‌ర్స్ కేసులు పెడుతున్నార‌ని, రాబోయేది వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ‌మేన‌ని, ఇంత‌కు ఇంతా చెల్లిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. సోమ‌వారం కొవూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌లువురు వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌స‌న్న‌కుమార్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..`గత 50 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డికి, మా మధ్య కొన్ని రాజకీయ విభేదాలు ఉండేవ‌ని,  విమర్శలు చేసుకున్నా మళ్ళీ ఎదురుగా వ‌స్తే ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళం. ఇటీవ‌ల మా ఇంటి పై దాడి ఘటనకు  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు కార‌ణం. కోడూరు కమలాకర్ రెడ్డి, దువ్వూరు కల్యాణ్ రెడ్డి,జెట్టి రాజగోపాల్ రెడ్డి,పెనుబల్లి కృష్ణ చైతన్య, సుధాకర్ రెడ్డి, మల్లా రెడ్డి ఇలా మొత్తం 8 మంది దగ్గరుండి మా ఇంటి మీద దాడి చేయించార‌ని సాక్ష్యాలుతో సహా వీడియో చూపించినా పోలీసులు కేసు కట్టలేదు.  మ‌ద్యం తాగి గొడ్డళ్లు పట్టుకుని మా ఇంటి మీదకు వచ్చారు, నేను వుంటే కచ్చితంగా చంపేసేవారు, 85 ఏళ్ల మా అమ్మ‌ను బెదిరించారు.  నేను అనుకుంటే 10 వేల మందితో వెళ్ళి వారి భవనం కూలగొట్టి వారిని ఎత్తుకు రాగలను. రాజకీయాలు రాజకీయాలుగా చేయాలి` అంటూ ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి హెచ్చ‌రించారు. 

Back to Top