1వ తేదీ.. పింఛ‌న్ల పంపిణీ పండ‌గ మొద‌లైంది

ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి పింఛ‌న్ సొమ్ము అంద‌జేస్తున్న వ‌లంటీర్లు

తాడేప‌ల్లి: రాష్ట్రవ్యాప్తంగా బుధ‌వారం తెల్లవారు జాము నుంచి అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైయ‌స్ఆర్ పింఛ‌న్ కానుక పంపిణీ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న‌ 63,87,275 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల వృత్తిదారులకు పింఛ‌న్లు అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.1,759.99 కోట్లను విడుద‌ల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఆ ప్రాంతంలోని లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా పింఛన్‌ డబ్బును ప్రభుత్వం.. ఆయా సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. బుధవారం తెల్లవారుజాము నుం­చే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. నేటి నుంచి నుంచి ఐదురోజుల పాటు పింఛ‌న్ల పంపిణీ కొనసాగుతుందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తెలిపారు. 

తాజా వీడియోలు

Back to Top