వైయస్‌ఆర్ జిల్లా: వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఏకపక్షంగా విచారణ సాగిస్తోందని వైయస్‌ఆర్ జిల్లా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేయర్ సురేష్‌బాబు అన్నారు. సాక్ష్యాధారాలు లేకపోయినా వైయస్‌ఆర్ సీపీ ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డిని కేసులో ఇరికించేందుకు సీబీఐ కుట్ర చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, మేయర్ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. అప్రూవర్ పేరుతో దస్తగిరికి సీబీఐ మద్దతిస్తోందని, బెయిల్‌పై అతను బయట తిరుగుతున్నాడన్నారు. ఆడియో, వీడియో రికార్డింగ్‌తో న్యాయవాది సమక్షంలో సీబీఐ విచారణ చేయాలని ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి కోరారని చెప్పారు. దీనిపై కూడా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా ప్రసారాలు చేయడం బాధాకరమన్నారు. విచారణకు ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. సీబీఐపై ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా విచారణ చేయాలని సురేష్ బాబు కోరారు.