మ‌హానేత వైయ‌స్ఆర్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు

ఇడుపుల‌పాయ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పాల్గొన్న ముఖ్య‌మంత్రి 

వైయ‌స్ఆర్ జిల్లా: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం వైయ‌స్ జగన్‌ పాల్గొన్నారు. సతీసమేతంగా ఇడుపులపాయ వెళ్లిన సీఎం వైయ‌స్ జగన్‌.. తల్లి వైయ‌స్‌ విజయమ్మ, మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.  

Back to Top