తాడేపల్లి: దివంగత మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగంగా స్పందించారు. ‘‘నాన్నా... మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది’’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. భౌతికంగా మా మధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.