ఢిల్లీ: పోలవరం, పార్టీ ఫిరాయింపుల చట్టంపై రాజ్యసభలో చర్చకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు, సవరించిన అంచనాల ప్రకారం పోలవరం నిధులు విడుదలలో జాప్యంపై చర్చకు అనుమతించాలని రూల్ 267 కింద వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నోటీసులు ఇచ్చారు. అదే విధంగా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను అనుసరించి పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చకు అనుమతించాలని రూల్ 267 కింద వైయస్‌ఆర్ సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నోటీసులు ఇచ్చారు. అదే విధంగా లోక్‌సభలో పోలవరం ప్రాజెక్టుపై చర్చకు ఎంపీ వంగా గీత వాయిదా తీర్మానం ఇచ్చారు.