గ‌తం కంటే ఎక్కువ మెజార్టీ సాధిస్తాం

వైయ‌స్ఆర్ సీపీ బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ డీసీ గోవింద‌రెడ్డి

తాడేపల్లి: పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మ‌ష్టి కృషితో బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో గ‌తం కంటే ఎక్క‌వ మెజార్టీ సాధిస్తామ‌ని బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ సీపీ ఇన్‌చార్జ్ డీసీ గోవింద‌రెడ్డి అన్నారు. బ‌ద్వేలు నియోజకవర్గం దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబానికి మద్దతుగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమైన అనంతరం డీసీ గోవిందరెడ్డి మీడియాతో మాట్లాడారు. డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైందని, ఈ ఎన్నిక వైయ‌స్ఆర్ సీపీకి నల్లేరు మీద నడక అని ధీమా వ్యక్తం చేశారు. దివంగత వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధను వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థిగా సీఎం వైయ‌స్ జగన్ ప్ర‌క‌టించార‌న్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న‌ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు డాక్ట‌ర్ సుధ‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయ‌న్నారు. 

సంక్షేమ ప‌థ‌కాలే భారీ మెజార్టీతో గెలిస్తాయి: డాక్ట‌ర్ సుధ‌
అభ్య‌ర్థి డాక్ట‌ర్ దాస‌రి సుధ మాట్లాడుతూ.. బ‌ద్వేలు అభ్య‌ర్థిగా అవ‌కాశం క‌ల్పించిన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. సీఎం వైయ‌స్ జగన్ సంక్షేమ ప‌థ‌కాలే త‌న‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top