అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో నిజమైన రౌడీ చంద్రబాబే అని వైయస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు చేయని కుట్రలు లేవని మండిపడ్డారు. అనంతపురం తన పుట్టిల్లు అని, తన కుమారుడు వైయస్ జగన్ మంచి చేస్తారని మాటిచ్చారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని నార్పాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడారు. అన్నదమ్ములు,అక్కచెల్లెమ్మలకు పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు.వైయస్ఆర్ను ప్రేమించిన ప్రతి హృదయానికి,వైయస్ జగన్‌ను అక్కున చేర్చుకున్న ప్రతి గుండెకు హృదయపూర్వక కృతజ్ఞతలు.మీ అభిమానానికి హద్దులేవు.ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ధర్మానికి,అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం.విలువలకు,విశ్వసనీయతకు పట్టం కట్టమని అడుగుతున్నా..గత ఎన్నికల్లో మనం మోసపోయాం..చంద్రబాబుకు ఓటువేసి మళ్లీ మోసపోవద్దు అని కోరుతున్నా..అనంతపురం జిల్లా నాకు పుట్టిల్లు.ఈ జిల్లాకు ఆడబిడ్డను నేను.వైయస్ఆర్ ఈ జిల్లాకు అల్లుడు.వైయస్ జగన్ ఈ జిల్లాకు మనవడు.వైయస్ రాజశేఖర్‌రెడ్డికి ఈ జిల్లా అంటే ఎంతో ఇష్టం.ఎందుకంటే ఆనాడు రాయలసీమ ఉద్యమం, పోతిరెడ్డిపాడు ఉద్యమాలు వంటి ఎన్నో ఉద్యమాలు ఈ జిల్లా నుంచే వైయస్ఆర్ ప్రారంభించారు. రాజస్థాన్ తర్వాత ఈ జిల్లా కరువు జిల్లా..దేశంలోనే రెండవస్థానం. వైయస్ఆర్ ఈ జిల్లాకు వైయస్ఆర్ కేవలం 5 సంవత్సరాల 3నెలల కాలంలో 12వేల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు.ఒకసారి గుర్తుచేస్తున్నా.వైయస్ఆర్ అనంతపురం జిల్లా రైతులకు చేసిన మేలు..1116 కోట్లు పంటల బీమా,ఇన్పుట్ సబ్సిడీ నూరు కోట్లు, కరెంటు బిల్లులు మాఫీ 71 కోట్లు,ఉచిత విద్యుత్ 150 కోట్లు,రుణమాఫీ 555 కోట్లు,ప్రోత్సహాకాలు 170 కోట్లు, వేరుశనగ విత్తనాలు రాయితీలు 480 కోట్లు, ఇతర విత్తనాలు 90 కోట్లు, పంటరుణాలు 6,594 కోట్లు వైయస్ఆర్ ఈ జిల్లాకు ఇచ్చి ఎంతో మేలు చేశారు.ఈ జిల్లా రైతులకు ఇచ్చినంత రాయితీలు ఏ జిల్లాకు వైయస్ఆర్ ఇవ్వలేదు.ఎందుకింత వివరంగా చెబుతున్నానంటే అనంతపురం జిల్లా నా పుట్టినిల్లు.గత ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలు మాత్రమే ఇవ్వడం చాలా బాధకలిగింది. అనంతపురం జిల్లా ప్రజలు,రైతులు.. వైయస్ఆర్ చేసిన మేలు మరిచిపోయారా అని బాధపడ్డా..ఈ సారైనా వైయస్ఆర్ను గుర్తుపెట్టుకొని విజయమ్మకు అన్ని సీట్లు బహుమతిగా ఇవ్వాలని కోరుతున్నా..ఈ జిల్లాలో హాంద్రీనీవా మొదలుకుని ఎన్నో ప్రాజెక్టులను వైయస్ఆర్ మొదలుపెట్టారు.నేడు చంద్రబాబు అబద్ధాపు హామీలతో మోసం చేశాడు.వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతవరుకూ పరిహారం ఇవ్వలేదు.ఆనాడు వైయస్ఆర్ హయాంలో రైతులకు మొదటి సంతకంతోనే రైతులకు లక్షన్నర ఇచ్చారు.చంద్రబాబుకు ఓట్లు కోసమే బీసీలు గుర్తుకొస్తారు.వైయస్ జగన్ బీసీల డిక్లరేషన్ కూడా ప్రకటించారు.ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు 50 శాతం నామినేటెడ్ పదవులను కేటాయిస్తామని జగన్ చెప్పారు.బీసీలకు న్యాయం చేసింది ఆనాడు వైయస్ఆర్..నేడు వైయస్ జగన్. బీసీలకు 41 ఎమ్మెల్యే సీట్లు,7 ఎంపీ సీట్లు ఇచ్చిన ఘనత వైయస్ఆర్సీపీదే.ఈ జిల్లాకు రెండు ఎంపీ సీట్లను బీసీలకు కేటాయించాం.చంద్రబాబు బీసీలను గౌరవించలేదు.ఎస్సీలను చాలా చులకనగా చూశారు.దళితులపై దాడులు,దౌర్జన్యాలు,భూములు లాక్కున్న చరిత్ర చంద్రబాబుది.మైనార్టీలను కరివేపాకులా వాడుకుని వదిలేశారు. ఇంతవరుకు మైనార్టీలకు మంత్రి పదవులు కేటాయించలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు.అవసరానికి హామీలు లిచ్చి.. ఆ తర్వాత మర్చిపోయే నైజం చంద్రబాబుది.ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నా.వైయస్ఆర్ సంక్షేమ పాలనను గుర్తుకుతెచ్చుకోమని కోరుతున్నా.వైయస్ఆర్ ఆనాడు ఉచిత విద్యుత్, కరెంట్ బకాయిలపై సంతకాలు చేశారు. వెంటనే అమలు జరిగింది. చంద్రబాబు ఇచ్చిన ఒక హామీ కూడ నెరవేరలేదు. వైయస్ కుటుంబానికి,ప్రజలకు 40 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది.వైయస్ఆర్ ముఖ్యమంత్రి కాక ముందు,అయిన తర్వాత ప్రతి జిల్లాకు వందల సార్లు తిరిగారు. ప్రతి జిల్లాలో కొన్ని లక్షల మందిని పేరుతో పిలిచే చనువు ఉంది.సంక్షేమం,అభివృద్ధి రెండుకళ్లుగా ముందుకెళ్ళారు. వ్యవసాయం పండగ చేయాలని జలయజ్ఞం ప్రారంభించారు. రాష్ట్రంలో 71 లక్షలు పెన్షన్లు ఇచ్చిన ఘనత వైయస్ఆర్ది.ఇళ్లు లేని రాష్ట్రం ఉండకూడదని రాష్ట్రంలో 48 లక్షలు ఇళ్లు నిర్మించారు. రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు.పేదవాడి ఆరోగ్యం కోసం ఆస్తులను అమ్ముకోకూడదని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు.లక్షల మందికి ఆపరేషన్లు చేయించారు.108,104 ప్రవేశపెట్టి ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదించారు. ప్రతిపేదవాడు ఉన్నత చదువులు చదవాలనే ఆశయంతో ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేపెట్టారు. శాచునేషన్ విధానం ద్వారా కుల,మత,పార్టీలకు అతీతంగా అన్నివర్గాలకు సంక్షేమపథకాలు అమలు చేశారు.వైయస్ఆర్ కాలంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేస్తూ ఒక పైసా కూడా పన్నులు పెంచలేదు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచితే..అక్కచెల్లెమ్మలపై భారం పడకూడదని ఆ ధరను ప్రభుత్వమే భరించింది.చంద్రబాబు హయాంలో చార్జీలు,పన్నులు ఎన్ని సార్లు పెరిగాయో ఒకసారి ఆలోచన చేయాలని అడుగుతున్నా..నేడు జరుగుతుంది అంతా దగా,మోసం,అన్యాయాలు,అక్రమాలు,దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వైయస్ఆర్ చివర వరుకు ప్రజల కోసమే ఆలోచించారు.రచ్చబండకు వెళ్తూ వైయస్ఆర్ ప్రాణాలు కోల్పోయారు. వైయస్ఆర్ మరణం తట్టుకోలేక ఎంతో మంది గుండెలు ఆగిపోయాయి.వారిని ఓదార్చేందుకు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు.ఓదార్పు యాత్ర చేయడం కాంగ్రెస్‌కు నచ్చలేదు. వైయస్ జగన్‌కు ఎవరూ సాయం చేయకూడదని ఆదేశాలిచ్చారు.ప్రజలకు ఇచ్చిన మాట కోసం వైయస్ జగన్ కాంగ్రెస్‌నుంచి బయటకు వచ్చారు.చంద్రబాబు,కాంగ్రెస్ కలిసి వైయస్ జగన్‌పై కుట్రలు చేసి అక్రమ కేసులు పెట్టారు.జైలుకు పంపించారు..వైయస్ఆర్ బతికుండగా నేను ఎన్నడూ బయటకు రాలేదు.వైయస్ జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు..18 మంది ఎమ్మెల్యేలను,ఒక ఎంపీని గెలిపించుకోవడానికి బయటకురావాల్సి వచ్చింది.అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు.సిబిఐ,ఈడి దాడులు చేశారు. ఆస్తులను అటాచ్‌చేసి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసి రోడ్డుకిడ్చారు. వైయస్ఆర్ వల్ల పైకి వచ్చిన వారు కష్టకాలంలో మా వెంటలేరు. అలాంటి సమయంలో మా కుటుంబానికి,వైయస్ జగన్‌కు తోడు ప్రజలు ఉన్నారు.ప్రజల రుణం ఎప్పటికి తీర్చుకోలేం.వైయస్ జగన్ రైతులకు భరోసాగా పెట్టుబడి సాయం కింద 12,500 ప్రకటిస్తే..ఆ తర్వాత చంద్రబాబు అన్నదాత సుఖీభవ అంటూ కొత్త పథకం ప్రవేశపెట్టాడు.ఈ ఐదేళ్లలో చంద్రబాబుకు రైతులు గుర్తుకురాలేదా.డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరుకు పొదుపు సంఘాల్లో మీకు అప్పు ఎంతైతే ఉందో ఆ మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా మీ చేతికి ఇస్తాం.సున్నావడ్డీకే రుణాలు ఇచ్చి బ్యాంకుల వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారీటీ అక్కలకు కార్పొరేషన్ల ద్వారా 75 వేలు దఫాలుగా వైయస్ఆర్ చేయత పథకం ద్వారా ఉచితంగా ఇస్తాం. ఖాళీగా ఉన్న 2 లక్షల 30వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తాం. ప్రతి ఏటా జనవరి 1న నోటిఫికేషన్ల క్యాలెండర్ జారీ చేస్తాం. మన ప్రభుత్వం రాగానే గ్రామ సచివాలయాల ద్వారా యువతకు గ్రామానికి 10 ఉద్యోగాలు ఇస్తాం. 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటిర్ ద్వారా ప్రభుత్వ పథకాలు మీ ఇంటికే అందేలా డోర్ డెలివరీ చేస్తాం. గ్రామ వాలంటిర్‌కు 5 వేలు గౌరవ వేతనం ఇస్తాం. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేస్తాం.దీని కోసం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతాం. గవర్నమెంట్ తీసుకునే కాంట్రాక్టు సర్వీసులు(ఏపీఎస్ఆర్టీసీ బస్సులు,అద్దెకు కార్లు వంటి కాంట్రాక్టులు), మొత్తం నిరుద్యోగులకే ఇస్తాం.పెట్టుబడి కోసం నిరుద్యోగ యువతకు సబ్సిడీ కూడా ఇస్తాం.ఈ కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారీటీ యువతకు కేటాయిస్తాం.వైయస్ జగన్ ప్రభుత్వంలోకి రాగానే సంక్షేమం,అభివృద్ధి జరుగుతుంది. ‘‘ఏపీలో నిజమైన రౌడీ చంద్రబాబు. ఎవరైనా ఎదురు తిరిగితే.. తాటతీస్తా.. ఫినిష్ చేస్తా అంటూ బెదిరిస్తున్నారు. అమరావతి పేరుతో టీడీపీ నేతలు భూ దోపిడీ చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు. ఏపీ ప్రజల డాటా చోరీ చేసిన దొంగ చంద్రబాబు. భన్వర్‌లాల్‌కు.. రోజాకు సంబంధం ఉందని చెప్పడానికి చంద్రబాబుకు సిగ్గుందా. ఆడవాళ్లను గౌరవించే విధానం ఇదేనా. మహిళల మాన ప్రాణాలతో చంద్రబాబు నీచ రాజకీయలు చేస్తున్నారు. మూడు రోజుల నుంచి చంద్రబాబు అనేక డ్రామాలు ఆడుతున్నారు. గుండెపోటు పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడే అవకాశం కూడా ఉంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. వైయస్ఆర్సీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.