తాడేపల్లి: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 354 వ ఆరాధన మహోత్సవాలకు హాజరు కావాలంటూ వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మఠం ప్రతినిధులు ఆహ్వానం అందజేశారు. మంగళవారం వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను రాఘవేంద్రస్వామి మఠం ప్రతినిధులు కలిసి ఆగష్టు 8 నుంచి 14 వరకు నిర్వహిస్తున్న ఆరాధన మహోత్సవాలకు ఆహ్వానించారు. మఠం అసిస్టెంట్ మేనేజర్ నరసింహ స్వామి, ఆలయ సూపరింటెండెంట్ అనంత పురాణిక్ వైయస్ జగన్‌కు ఆహ్వాన పత్రిక, స్వామివారి జ్ఞాపిక అందజేశారు.