తాడేపల్లి : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత శిబూ సోరెన్ మృతిపట్ల వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడైన శిబూ సోరెన్ మృతి దేశానికి తీరని లోటన్నారు. గిరిజన సంక్షేమం కోసం శిబూ సోరెన్ చేసిన కృషి చిరస్మరణియమని కొనియాడారు. ఈ మేరకు శిబూ సోరెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానంటూ వైయస్ జగన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ ద్వారా ట్వీట్ చేశారు.