దోచుకోవడమే చంద్రబాబు నైజం

ఇసుక,మట్టి,బొగ్గును  కూడా దోచుకున్నారు

40 ఏళ్ల అనుభవంతో రాష్ట్రానికి ఏం చేశావ్‌..

ప్రజలకు మేలు చేయాలని జగన్‌ ఆరాటపడుతున్నాడు.

వైయస్‌ఆర్‌ ఆశయాల కోసం జగన్‌ శ్రమిస్తున్నారు

ప్రజా సంక్షేమమే జగన్‌ వ్యక్తిత్వం..

పొందూరు ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ విజయమ్మ

 

శ్రీకాకుళం జిల్లా:మంత్రి యనమల రామకృష్ణుడికి పంటినొప్పి వస్తే చంద్రబాబు ఆయనను సింగపూర్‌ పంపించారని. పేదవాళ్ల ఆరోగ్యం  ఆరోగ్యం కాదా..అని వైయస్‌ విజయమ్మ ప్రశ్నించారు. ఏపీని అన్యాయంగా అక్రమంగా తెలుగుదేశం నేతలు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. పొందూరులో ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు.

ప్రసంగం ఆమె మాటల్లోనే..

వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిని  మీ భుజ స్కందాలపై మోసి సీఎం చేసుకున్నారు.ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. వైయస్‌ఆర్‌ మరణిస్తే..ఎన్నో గుండెలు ఆగిపోయాయి. ఇచ్చిన మాట కోసం వైయస్‌ జగన్‌ ఓదార్పు చేశారు. జగన్‌ ఓదార్పు యాత్ర చేస్తే ప్రజలందరూ అక్కున చేర్చుకుని ఆదరించారు. అది కాంగ్రెస్‌వాళ్లకు నచ్చలేదు.వద్దని శాసించారు.ఇచ్చిన  మాట కోసం జగన్‌ కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చారు.తొమ్మిది సంవత్సరాలుగా జగన్‌ను ప్రజలు ఒక నాయకుడిగా తీర్చిదిద్దారు. మా కుటుంబం మీకు రుణపడి ఉంటుంది.వైయస్‌ఆర్‌ను,జగన్‌ను ఎంతోగానో ఆదరించారు.వైయస్‌ఆర్‌ హయాంలో అన్నివర్గాలు ఎంతో సంతోషంగా ఉన్నారు.మాకు వైయస్‌ఆర్‌ను పొగ్గొట్టుకున్న కష్టం కన్నా ఈ రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగింది.చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.వైయస్‌ఆర్‌ చెప్పింది.చెప్పనిది చేసి ఓటు అడిగారు.చంద్రబాబు ఇది చేశానని చెప్పడానికి ఏమైనా ఉందా..చంద్రబాబుకు ఓటు అడిగే హక్కులేదు.చంద్రబాబు అబద్ధాల వాగ్ధానాలతో ప్రజలను మోసం చేశారు.రాజశేఖర్‌రెడ్డి పరిపాలనలో కుల,మత,పార్టీలకు అతీతంగా శాచునేషన్‌ పద్దతిలో అందరికి మేలు చేశారు.ప్రతి సంక్షేమం పథకం కూడా ప్రజలకు చేరింది.

చంద్రబాబు పాలనలో ఏమి అందిందని అడుగుతున్నా..వైయస్‌ఆర్‌ రైతే రాజుగా  ఉండాలని, వ్యవసాయం పండగలా చేయాలని ఆశించారు. మొట్టమెదటి సంతకం ఉచిత విద్యుత్‌పై పెట్టారు.కరెంట్‌ బకాయిల మాఫీ, గిట్టుబాటు ధరలు,బీమా వంటివి రైతులకు అందించారు.ఆ రోజు గిట్టు బాటు ధరలు నేడు లేవు. చంద్రబాబు హయాంలో రైతులకు బీమా కూడా ఇవ్వలేదు.కనీసం మద్దతు ధరలు కూడా ఇవ్వలేదు.ఆ రోజు పసుపు 14వేల రూపాయలు అయితే నేడు ఆరు వేలు కూడా ఉండటం లేదు.,ఆరోజు వరి వెయ్యి నుంచి పదకొండు వందల రూపాయలకు పెరిగింది. నేడు ఎంత ఉంది.తొమ్మిదేళ్లు తర్వాత కేవలం 13 వందలు మాత్రమే గిట్టుబాటు ధర ఉంది.మిర్చి ఆరోజు  12వేలు ఉంటే..నేడు ఆరువేలు కూడా ఉండటం  లేదు.87 కోట్ల రూపాయలు రుణామాఫీ చేస్తానని చెప్పారు..చేశారా. వడ్డీ రుణాలు కూడా అందకుండా చేశారు. ఉచిత కరెంటు కూడా సరిగ్గా రావడంలేదు.అన్నదాతకు వైయస్‌ జగన్‌ 12,500 ప్రకటిస్తే..నేడు చంద్రబాబు అన్నదాత సుఖిభవ అంటూ మోసం చేస్తున్నాడు..ఒకసారి ఆలోచించామని అడుగుతున్నా.. పసుపు–కుంకుమ అంటూ నేడు చంద్రబాబు మహిళలను మభ్యపెడుతున్నాడు.పెద్దన్న అని చెబుతున్నాడు.

అధికారంలో ఉన్న ఐదేళ్లలో పూర్తిచేయ్యనిది..ఈ నెలలో పసుపు–కుంకమ ప్రకటించి ఏవిధంగా అన్న అవుతాడు అని అడుగుతున్నా..రెండు రూపాయలకు ఇరవై లీటర్లు నీరు ఇస్తానని చెప్పారు..ఈ రోజు ఏ జిల్లా చూసిన ఎక్కడ చూసిన తాగు,సాగు నీరుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.బార్‌ షాపులు రద్దు చేస్తానని చెప్పాడు.. నీళ్లు దొరకడంలేదు కాని మద్యం మాత్రం సంపూర్ణంగా దోరుకుతుంది.బాబు వస్తే జాబు రావాలి వచ్చిందా..ఖాళీగా ఉన్న 2 లక్షల పై చిలుకు పోస్టులను ఎందుకు భర్తీ చేయడంలేదు.ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేశారు.ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించక ప్రజలకు ఆరోగ్యశ్రీ అందడంలేదు.వైయస్‌ఆర్‌ హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి ఆపరేషన్లు జరిగాయి. వైయస్‌ఆర్‌ హయాంలో ఫోన్‌ చేసిన 10 నిముషాల్లో 108 అంబులెన్స్‌ వచ్చేంది. ఎంతో మందికి పునర్జన్మను ఇచ్చారు.చంద్రబాబు హయాంలో 108 వస్తుందా..ఎప్పుడు వస్తుందో తెలియదు.104ను కూడా నిర్వీర్యం చేశారు.పేదలు ఉన్నత చదువులు చదవాలని వైయస్‌ఆర్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తెచ్చారన్నారు.చంద్రబాబు హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందుతుందా..మెరిట్‌ స్టూడెంట్లు కూడా చదవలేకపోతున్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో దేశంలో ఆ నాడు 48 లక్షలు ఇళ్లు కడితే వైయస్‌ఆర్‌ ఒక్కరే మన రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లు కట్టారు. కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు గ్యాస్‌ ధరల పెంచితే.. అక్కాచెల్లెమ్మలకు భారం కాకూడదని ప్రభుత్వమే భరించింది.

వైయస్‌ఆర్‌ హయాంలో ప్రజలందరూ సుబిక్షంగా ఉన్నారు. నేడు చంద్రబాబు ఏంచేశారని ఓటు అడుగుతున్నారు.పోలవరం ప్రాజెక్టు ఎక్కడైనా కనిపిస్తుందా..జిల్లాల్లో అన్ని ప్రాజెక్టులను  వైయస్‌ఆర్‌ మొదలుపెట్టి 700 కోట్లు ఖర్చుపెట్టి 70శాతం పూర్తిచేశారు. తర్వాత వచ్చిన  ప్రభుత్వాలు పూర్తిచేయలేదు.అముదాలవలసకు వంశధార ప్రాజెక్టు నుంచి రావాలంటే రైల్వే ట్రాక్‌ అడ్డం వచ్చింది.అందరూ ఎలా నీరు తీసుకువస్తారని అడిగారు.వైయస్‌ఆర్‌ చిత్తశుద్ధి,పట్టుదలతో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా వయాడెక్ట్‌ ద్వారా ఆముదాల వలసకు నీరు తెచ్చారు. లాభాల్లో నడుస్తున్న ఆముదాల వలస షుగర్‌ఫ్యాక్టరీని చంద్రబాబు మూయించివేసి రైతుల పొట్టగొట్టారు.ఎంత సిగ్గుపడాల్సిన సందర్భం ఏమిటంటే పెన్షన్‌ కోసం పొందూరులో 880 మంది కోర్టుకు వెళ్ళిన సందర్భం.వైయస్‌ఆర్‌ హయాంలో 14వేలకు ఉన్న పింఛన్లను 71వేలకు తీసుకెళ్ళారు.చంద్రబాబు పాలనలో ఇసుక,మట్టి,బొగ్గు,భూములు అన్ని దోచుకుంటున్నారు.రాజధాని కోసం 53 వేల ఎకరాలను తీసుకున్నారు.రాజధాని నిర్మించారా అని అడుగుతున్నా..అన్ని తాత్కాలిక భవనాలే..వర్షం వస్తే లీకేజీలే..విజయవాడ దుర్గమ్మ దగ్గర ప్లైఓవర్‌ కూడా పూర్తిచేయలేదు.రైతుల దగ్గర భూములు తీసుకుని సింగపూర్‌ కంపెనీలకు,రియల్‌ ఎస్టేట్‌లకు ఇచ్చి తన బినామీలను కాపాడుకుంటున్నారు.ప్రత్యేకహోదా కోసం జగన్‌ ఎన్నో పోరాటాలు చేశారు.కడుపు మాడ్చుకుని దీక్షలు చేశారు.చంద్రబాబు ప్రత్యేకహోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ కావాలని అడగలేదా.ప్రత్యేకహోదా నిలబడిందంటే అది జగన్‌ వలనే..ప్రత్యేకహోదా కోసం వైయస్‌ జగన్‌.. మోదీ ప్రభుత్వంపై 14 సార్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టారు.ఎంపీలు చేత రాజీనామాలు కూడా చేయించారు.

25 మంది ఏపీలను గెలిపించండి ప్రత్యేకహోదా తెచ్చుకుందాం.చంద్రబాబు నాలుగున్నర సంవత్సరాలు బీజేపీతో ఉన్నారు..అప్పుడు తల్లి కాంగ్రెస్‌..పిల్ల కాంగ్రెస్‌ అని చెప్పాడు..నేడు  రాహుల్‌ గాంధీతో కలిసి బీజేపీ,కేసీఆర్‌ అని చెబుతున్నాడు.జగన్‌ కేసీఆర్‌తోను,మోదీతోను,కాంగ్రెస్‌తోను కలవడంలేదు. జగన్‌ ఒక్కరే పోటి చేస్తున్నారు.ప్రజల సంక్షేమమే జగన్‌  వ్యక్తిత్వం. ఎవరి లొగ్గే పరిస్థితి లేదు.భయపడే పరిస్థితి లేదు.జగన్‌పై ఎన్నో కుట్రలు చేశారు..ఆస్తులు అటాచ్‌మెంట్‌ చేసి,జైలుపాలు చేశారు..అప్పుడే జగన్‌ భయపడలేదు.చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన నా కుమారుడు జగన్‌ భయపడడు. చంద్రబాబు జగన్‌ రౌడీ అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.నా కుమారుడు కాదు రౌడి..మీరు రౌడీలు.. జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్లు  అంటూ ప్రచారం చేస్తున్నారని..కేసీఆర్‌కు మనకు ఏమిటి సంబంధం. కేసీఆర్,మనం కలిసి పోటి చేస్తున్నామా..రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే  జగన్‌ కోరుకుంటున్నారు. మళ్లీ రాజన్న రాజ్యం తీసుకువచ్చి సంక్షేమపథకాలను ప్రజలకు చేర్చాలని జగన్‌ ఆరాటపడుతున్నారు.

Back to Top