చంద్రబాబుకు విలువలు లేవు..

దోచుకోవడమే చంద్రబాబు పాలన..

సాగునీరు దేవుడెరుగు..బాబు పాలనలో తాగునీరు కూడా లేదు

ఏంచేశాడని చంద్రబాబుకు ఓటేయాలి..

ప్రజలకు జగన్‌ అండగా ఉంటారు

విలువలు,విశ్వసనీయత జగన్‌ నైజం

కొత్తూరు ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ విజయమ్మ

శ్రీకాకుళం జిల్లా: ఎన్నికలు వచ్చాయనే చంద్రబాబు పసుపు–కుంకుమ ఇస్తున్నారని వైయస్‌ విజయమ్మ అన్నారు.ఎన్నికల వేళ ప్రజలను మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబుకు విలువలు లేవని,అబద్ధ,మోసాలతో టీడీపీ పాలన సాగిందన్నారు.పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు.

ప్రసంగం ఆమె మాటల్లోనే..

శ్రీకాకుళం జిల్లా: వైయస్‌ఆర్‌ను  గుండెల్లో పెట్టుకున్న ప్రతి హృదయానికి,వైయస్‌ జగన్‌ను హృదయాల్లో పెట్టుకున్న ప్రతి హృదయానికి అభినందనలు న్యాయానికి,అన్యాయానికి మధ్య యుద్ధం జరుగుతుంది.ధర్మానికి,అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. విలువలకు,విశ్వసనీయతకు ఓటు వేయాలని కోరుతున్నా.ఎక్కడ చూసిన అన్యాయం,అక్రమం,మోసం..ఇసుకు నుంచి మట్టి దాకా..మట్టి నుంచి బొగ్గు దాకా..బొగ్గు నుంచి రా«జధాని భూములు దాకా..ఆలయ,దళితుల భూములను కూడా వదలిపెట్టడం లేదు.వైయస్‌ కుటుంబంతో ఉన్న అనుబంధం ఒకసారి గుర్తుచేసుకోండి.40 సంవత్సరాల అనుబంధం.వైయస్‌ఆర్‌ను 30 సంవత్సరాలు మీ భుజస్కందాలపై మోసుకుని సీఎం చేసుకున్నారు. ఆయన ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు.వైయస్‌ఆర్‌ గతంలో చెప్పింది,చెప్పనిని చేసి ప్రజల ముందుకు వెళ్ళారు.కాని చంద్రబాబు ఏం చేశారని ఓటు అడుగుతున్నారు.చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదు..తొమ్మిది సంవత్సరాల క్రితం వైయస్‌ఆర్‌ మరణిస్తే వందల మంది ప్రాణాలు వదిలారు.ఇచ్చిన మాట కోసం వైయస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర చేశారు.వైయస్‌ జగన్‌ ఓదార్పు చేయడం కాంగ్రెస్‌కు నచ్చలేదు.ఓదార్పుయాత్రలో వైయస్‌ జగన్‌ను ప్రజలు అక్కున చేర్చుకున్నారు.వైయస్‌ జగన్‌ను ప్రజలు నాయకుడిగా నిలబెట్టుకున్నారు.

వైయస్‌ కుటుంబం ఎప్పుడూ ప్రజలకు రుణపడి ఉంటుంది.వైయస్‌ జగన్‌పై కాంగ్రెస్,టీడీపీలు కక్షసాధింపు  చర్యలకు దిగాయి. ఎన్నో బాధలు,కష్టాలు పెట్టారు. ఆస్తులు అటాచ్‌చేశారు, జైలుకు పంపించారు.రాష్ట్రానికి మంచి చేయడానికి వైయస్‌ జగన్‌ ఎన్నో పోరాటాలు చేశారు. కడుపుమాడ్చుకుని మీ కోసం నిలబెట్టారు.వైయస్‌ఆర్‌ హయాంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించారు.వైయస్‌ఆర్, వైయస్‌ జగన్,షర్మిలు పాదయాత్రలు చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.ప్రజలకు అండగా జగన్‌ ఉన్నాడు.ఇచ్చిన మాటను జగన్‌ పాటిస్తాడు.40 సంవత్సరాల అనుభవం ఉందన్న చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు.గతంలో చెప్పే మోసపు మాటలు,వాగ్ధానాలు చేస్తున్నాడు.చంద్రబాబు చెప్పే మాటలు అబద్ధం,మోసం..ఇసుక నుంచి మట్టి దాకా..మట్టి నుంచి బొగ్గు దాకా.. ఆలయ,దళితుల భూములు అన్ని దోచుకుంటున్నారు.వైయస్‌ఆర్‌ పాదయాత్ర చేసి అనేక కష్టాలు తెలుసుకుని జిల్లాకు అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు.వంశధారకు సుమారు 700 కోట్ల ఖర్చుచేశారు. సుమారు 70 శాతం పూర్తిచేశారు. కాని నేటి ప్రభుత్వంతో మిగిలిన పనులు పూర్తికాలేదు.రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గాల్లో పాతపట్నం ఒకటి.గిరిజనులు,ఒడియా ప్రజలు,నిరుపేదలు అధికంగా ఉన్నారు.2014లో మన ఫ్యాన్‌గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధి పేరు చెప్పి పార్టీ ఫిరాయించారు.అభివృద్ధి జరిగిందా..ఏ పనులు మొదలు కాలేదు.వారి అభివృద్ధి ఇసుక,నిధులు దోచుకోవడమే..చంద్రబాబుకు విలువలు లేవు.వైయస్‌ఆర్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారు.ఇదే చంద్రబాబు తెలంగాణలో వారి ఎమ్మెల్యేలను కేసీఆర్‌ కొన్నాడంట..వారిని ఓడించామని ప్రచారం చేస్తాడు. వైయస్‌ జగన్‌ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాడు..ఎవరైనా పార్టీలోకి రావాలంటే వారి పార్టీ  అభ్యర్థిత్వానికి,పదవులకు రాజీనామా చేసిన తర్వాత మాత్రమే పార్టీలోకి చేర్చుకుంటున్నారు.ధర్మంగా రాజకీయాలు చేస్తున్నారు.

రాజ్యాంగ విలువలను చంద్రబాబు పాటించడంలేదు.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.ప్రతిఒకరిని మోసం చేయడమే చంద్రబాబు లక్ష్యం.గిరిజనులకు  కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు.చివరి మూడు నెలల్లో మంత్రి పదవి ఇచ్చాడు.అందరిని మోసం చేశాడు.తిత్లీ పరిహారం అడిగిన రైతులపై కేసులు పెట్టించాడు.అన్నదాతలు సైతం కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితులు బాబు పాలనలో ఉన్నాయి. రైతుల గోడు పట్టించుకోలేదు.జగన్‌ అధికారంలోకి వచ్చాక పోడుభూములకు పట్టాలిస్తాం. పెన్షన్‌ కోసం ప్రజలు  కోర్టుకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి.చంద్రబాబుకు అసలు మానవత్వం ఉందా..జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తాగు,సాగునీరు ప్రతిఒక్కరికి అందుతుంది.ప్రాజెక్టులను పూర్తిచేసుకుందాం.పునరావాస గ్రామాల్లో సరైన సౌకర్యాలు కల్పిస్తాం. నిర్వాసితులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తాం.వైయస్‌ఆర్‌ అన్నిరకాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులు,పరిశ్రమలు,అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించారు. చంద్రబాబు పాలనలో ఏంచేశారు. ఇసుక,మట్టి.భూములను కూడా వదలడంలేదు.చివరుకు ఆలయ భూములను కూడా వదలడం లేదు. 650 వాగ్ధానాలు  చేసి,ఐదుమాఫీలు చేస్తానని చెప్పి ఓటు వేయించుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు.ఒక్కసారి వైయస్‌ఆర్‌ను గుర్తుతెచ్చుకోమని అడుగుతున్నా..ఆయన పాలనలో జరిగిన సంక్షేమాన్ని గుర్తుచేసుకోండి. చంద్రబాబు రైతులకు రుణామాఫీ చేస్తానని చెప్పాడు..రుణమాఫీ చేశాడా..వైయస్‌ఆర్‌ హయాంలో రైతుల రుణమాఫీ చేయడంతో పాటు వ్యవసాయాన్ని పండగ చేసేవిధంగా రైతులను అన్నివిధాలుగా ఆదుకున్నారు. తాగునీరు,సాగునీరు అందించి అన్నిరకాలుగా మేలు చేశారు.చంద్రబాబు ఎన్నికలు రెండు నెలలు ఉన్నాయనగా అన్నదాత సుఖీభవ అంటున్నాడు.మీకు నమ్మకం ఉందా..మీ భవిష్యత్‌ నా బాధ్యత అనిచెబుతున్నాడు..నమ్మకం ఉందా..డ్వాక్రా అక్కాచెల్లెమ్మ రుణాలు మాఫీ చేస్తానన్నాడు చేశాడా.పసుపు–కుంకుమ అంటూ మళ్లీ మోసం చేస్తున్నాడు.

రెండు రూపాయలకే 20 లీటర్ల నీరు అన్నాడు..ఇచ్చాడు..ఎక్కడా కూడా తాగునీరు దొరకడంలేదు.ప్రతి గ్రామంలో బార్‌షాపుల్లో మద్యం మాత్రం సంపూర్ణంగా దొరుకుతుంది.రాష్ట్రంలో సుమారు 2లక్షలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయి.వాటిని భర్తీ చేయలేదు.కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. వైయస్‌ఆర్‌ హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల మందికి ఆపరేషన్లు జరిగాయి. చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీకి కనీసం బిల్లులు కూడా చెల్లించడం లేదు. పేదలు వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత   దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునే అవకాశం ఇస్తాం.ఎంత ఖరీదైనా ఆపరేషన్‌ అయినా,వైద్యం అయినా సరే ఉచితంగా అందిస్తాం. వైయస్‌ఆర్‌ హయాంలో ఎంతోమంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా ఉన్నత చదువులు చదివారు. చదువుకి ఎవ్వరికి పేదరికం అడ్డు కాకుడదని వైయస్‌ఆర్‌ అందరికి ఫీజురీయింబర్స్‌మెంట్‌ అమలు చేశారు.చంద్రబాబు హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక చదువులు మధ్యలోనే మానేస్తున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత  ఉన్నత చదువులు చదివిస్తాం.నూటికి నూరుశాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తాం.వసతి,భోజనానికి అదనంగా ఏడాదికి రూ.20వేలు ఇస్తాం.అమ్మఒడి ద్వారా  బడికి పంపితే చాలు మీ చేతికే సంవత్సరానికి 15 వేలు ఇస్తాం.

డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటి వరుకు పొదుపు సంఘాల్లో మీకు అప్పు ఎంతైతే ఉందో ఆ మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా మీ చేతికి ఇస్తాం. సున్నావడ్డీకే రుణాలు ఇచ్చి బ్యాంకుల వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారీటీ అక్కలకు కార్పొరేషన్ల ద్వారా 75 వేలు దఫాలుగా వైయస్‌ఆర్‌ చేయత పథకం ద్వారా ఉచితంగా ఇస్తాం. రైతులకు వైయస్‌ఆర్‌ భరోసా ద్వారా పంట వేసే సమయానికి మే నెలలో సంవత్సరానికి రూ.12వేలు పెటుబడి భరోసాగా మీ చేతులకే ఇస్తాం. వడ్డీలేని పంట రుణాలు ఇస్తాం. రూ.3వేల కోట్లుతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రకృతి విపత్తుల సహాయనిధికి మరో 4వేల కోట్లు ఇస్తాం. ప్రమాదశాత్తు లేదా ఆత్మహత్య కారణంగా రైతు దూరమైతే ఆ కుటుంబానికి రూ.7లక్షలు పరిహారం ఇస్తాం. ఆ డబ్బు అప్పులవాళ్లకు చెందకుండా చట్టం తీసుకువస్తాం. వైయస్‌ఆర్‌ హయాంలో శాచునేషన్‌ పద్దతిలో కుల,మత,పార్టీలకు అతీతంగా అందరికి సంక్షేమ పథకాలు అందజేశారు.ఆయన కాలంలో ఒక పైసా కూడా ట్యాక్స్‌లు పెంచలేదు.చంద్రబాబు పాలనలో ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు.మున్సిపల్‌ ట్యాక్స్‌లు ఎన్నిసార్లు పెంచారో లెక్కేలేదు.వైయస్‌ జగన్‌ రెండు సంవత్సరాల నుంచి నవరత్నాలను ప్రకటిస్తూ వచ్చారు.రైతులకు మే నెలలో 12,500 ఇస్తానని ప్రకటిస్తే..చంద్రబాబు అన్నదాత సుఖిభవ అంటూ తీసుకొచ్చాడన్నారు. నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారన్నారు.వైయస్‌ జగన్‌ ప్రతి హామీని నెరవేరుస్తాడు..

 

Back to Top