గౌతమ్‌రెడ్డి కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చిన వైయ‌స్ విజ‌య‌మ్మ‌

హైద‌రాబాద్‌: రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి శ్రీ మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయస్‌. విజ‌య‌మ్మ‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గౌత‌మ్‌రెడ్డి మ‌ర‌ణ వార్త తెలియ‌గానే అపోలో ఆసుప‌త్రికి వైయ‌స్ ష‌ర్మిల‌మ్మ‌తో క‌లిసి విజ‌య‌మ్మ చేరుకొని కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. గౌత‌మ్ రెడ్డి పార్థీవ‌దేహానికి నివాళుల‌ర్పించి, కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. ఈ స‌మ‌యంలో దేవుడు కుటుంబ‌స‌భ్యుల‌కు ధైర్యం ఇవ్వాల‌ని ప్రార్థించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top