వైయస్‌ విజయమ్మ జన్మదినోత్సవం సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ

కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని  కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆధ్వర్యంలో పలువురు డ్రైవర్లకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో డ్రైవర్లకు ఉపాధి కరువై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో వారి సమస్యలను గమనించి చేయూతనిచ్చారు.  ఈ సందర్భంగా సిద్దార్థ రెడ్డి మాట్లాడుతూ..కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు. ప్తరి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు.  కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఐజయ్య, చంద్రమౌళి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top