మహానేత విగ్రహం ఆవిష్కరణ

తాడేపల్లి:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం ఎదురుగా, అమరావతి ప్లే స్కూల్‌ వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. వైయస్‌ఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్‌ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చేసిన మేలులను గుర్తు చేసుకున్నారు. రాజన్న పాలన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకువచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల వ్యవధిలోని చారిత్రాత్మక చట్టాలకు ఆమోదం తెలిపి దేశానికే జగనన్న దిక్కూచిలా మారారని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహానేత వర్ధంతి కార్యక్రమాలను నియోజకవర్గంలో ఈ నెల 2వ తేదీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పలు సేవా కార్యక్రమాలు తలపెట్టినట్లు పేర్కొన్నారు. 

Back to Top