అన్నా చెల్లెళ్ల అనుబంధం

సీఎం వైయస్‌ జగన్‌కు రాఖీ కట్టిన షర్మిలమ్మ
 

హైదరాబాద్‌: అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి, ఆప్యాయతకు చిహ్నంగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆయన చెల్లెలు వైయస్‌ షర్మిలమ్మ రాఖి కట్టి ఆశీర్వాదం పొందారు.   రాఖీ పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. భారతీయ సంస్కృతిని చాటి చెప్పే రాఖీ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరికి రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. అలాగే పలువురు మహిళా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వైయస్‌ జగన్‌కు రాఖీ కట్టి ఆశీర్వాదం పొందారు.
 

హైదరాబాద్‌ బయల్దేరిన సీఎం జగన్‌ 

గన‍్నవరం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ బయల్దేరారు. ఇవాళ రాత్రికి ఆయన హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లనున్నారు. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవాసాంధ్రుల కోరిక మేరకు ఆయన ఆగస్ట్‌ 17న ప్రసిద్ధిగాంచిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కే బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్)లో ప్రసంగించనున్నారు. వారం రోజుల పాటు సీఎం జగన్‌ అమెరికా పర్యటన కొనసాగనుంది.  

Back to Top