నేడు పులివెందులకు వైయ‌స్‌ జగన్‌

పులివెందుల :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రికి హైదరాబాద్‌ నుంచి పులివెందులకు చేరుకుంటారని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు  క్యాంపు కార్యాలయంలో వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రజలతో మమేకమవుతారు. సాయంత్రం పులివెందుల పట్టణంలోని వీజే ఫంక్షన్‌ హాలులో ముస్లింలతో కలిసి ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు. 16వ తేదీ (గురువారం) ఉదయం నుంచి తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని  అవినాష్‌రెడ్డి వివరించారు.  

 

తాజా ఫోటోలు

Back to Top