విశాఖ: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. వైయస్ జగన్‌ను కలిసేందుకు వస్తున్న ప్రజలను ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, బారికెడ్స్ ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. వైయస్ జగన్ ను కలిసేందుకు పాడేరు నుండి బయలుదేరిన వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే , అల్లూరి జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వర రాజును పోలీసులు అడ్డుకున్నారు. వంతడపల్లి , గరికిబంధ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఎమ్మెల్యేను, పార్టీ నాయకులను నిలిపివేశారు. అలాగే మాడుగుల నియోజకవర్గం రాజం జంక్షన్ వద్ద ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు ను ముందుకు కదలకుండా అడ్డుకోవడంతో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు.