హాస్ట‌ల్ విద్యార్థుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ప‌రామ‌ర్శ‌

గుంటూరు జిల్లా : గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) లో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని, గుంటూరు నగర వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు షేక్ నూరీ ఫాతిమా, తాడికొండ నియోజకవర్గ ఇంచార్జ్ డైమండ్ బాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర‌ అధ్యక్షులు పానుగంటి చైతన్య ప‌రామ‌ర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి తెలుసుకొని, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.  ఈ సంద‌ర్భంగా విడదల రజిని మీడియాతో మాట్లాడుతూ..` కురుపాం, అనపర్రు ఇలా వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు అస్వస్థతకు గురై చనిపోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగానే అస్వస్థతకు గురవుతున్నారు. హాస్టల్స్ లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది . రాజకీయ నాయకుల రికమొండేషన్స్ తో ఉద్యోగాలు ఇచ్చారు. 31 మంది విద్యార్థులు ఇంకా జిజిహెచ్ లో చికిత్స పొందుతున్నారు. 
విద్యార్థుల అస్వస్థతకు కారణం ఏంటో ప్రభుత్వం ఇంతవరకూ నిర్ధారించలేదు. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. వార్డెన్ మీద విద్యార్థులే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. విద్యార్థులను వార్డెన్ కొడుతున్నా పట్టించుకున్నవాళ్ళే లేరు. ఎస్సి ఎస్టీ బీసీ లు అన్ని వర్గాల హాస్టల్స్ లో ఇదే పరిస్థితి నెలకొంది . సంక్షేమ హాస్టల్స్ ను విజిట్ చేస్తే ఈ ప్రభుత్వం కేసులు పెడుతుంది. సంక్షేమ హాస్టల్స్ పరిశీలించి లోపాలను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబే ప్రస్తుత పరిస్థితికి బాధ్యత వహించాలి` అని విడుద‌ల ర‌జినీ డిమాండ్ చేశారు.

Back to Top