విజయవాడ: రాష్ట్రంలోని వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవాడ సెంట్రల్ పరిధిలోని 64 వ డివిజన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మాజీ ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, సీఈసీ సభ్యుడు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో చేపట్టారు. స్థానిక డివిజన్ కార్పొరేటర్ యర్రగొర్ల తిరుపతమ్మ, శ్రీరాము, ఎస్ కే ఇస్మాయిల్, బత్తుల శేఖర్ , జిల్లెల్ల శివ , స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర , వెంకటేశ్వరమ్మ కొక్కుల గడ్డ నాని మాతా మహేష్ ,యేసు , వీర్రాజు ,పరిమి నాగేశ్వరరావు, లక్ష్మణ్, డాక్టర్ చిన్న, స్రవంతి, రజియా జెపి నాయుడు, రావి చిన్నారి , కల్పన, సావిత్రమ్మ , సావిత్రమ్మ, తదితరులు ఇంటింటా పర్యటించి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ..పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, ఉన్నత ఆశయానికి గండి కొడుతున్న కూటమి సర్కారు వైఖరికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి రూ. వేల కోట్లు దండుకోవడానికే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. దీనికి నిరసనగా పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ ప్రారంభిస్తున్నట్లు వివరించారు.