ఉద్య‌మంలా కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌

మాజీ డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌

ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గంలో కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌

శ్రీ‌కాకుళం:  మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటిసంతకాల సేకరణ కార్యక్రమం ఉద్య‌మంలా చేప‌ట్టాల‌ని శ్రీకాకుళం జిల్లా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్  పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిర‌ణ్ కుమార్‌ ఆధ్వ‌ర్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం తామాడ  గ్రామంలో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం మంగ‌ళ‌వారం చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌తో పాటు పార్లమెంటరీ పరిశీలకులు  కిల్లి సత్యనారాయణ, త‌దిత‌రులు పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో ర్యాలీ నిర్వ‌హించి మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా నిన‌దాలు చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌భ‌లో ధ‌ర్మాన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నాటి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ఇప్పడు కూటమి వాటిని ప్రైవేట్‌ప‌రం చేస్తుంద‌ని మండిప‌డ్డారు. కార్య‌క్ర‌మంలో లావేరు మండలం ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, లావేరు మండలం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దన్నాన రాజినాయుడు, వ్యవసాయ సలహా మండలి కార్యవర్గ సభ్యులు గొర్లె అప్పలనాయుడు,జడ్పిటిసి మీసాల సీతoనాయుడు,, మండల పార్టీ ఉపాధ్యక్షులు గొర్లె సూర్యప్రకాశరావు,  లావేరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేశెట్టి తిరపతిరావు,వైస్ ఎంపీపీ లుకలాపు శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గసభ్యులు బొంతు సూర్యనారాయణ, వాళ్ళే దాలి నాయుడు, మండల మహిళా అధ్యక్షురాలు మహంతి విజయలక్ష్మి, జేసిఎస్ కన్వీనర్ మీసాల శ్రీనివాస‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top