చెడుపై మంచి సాధించిన విజ‌యానికి ప్రతీక దీపావళి 

తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ వైయ‌స్ జ‌గ‌న్ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు
 

తాడేప‌ల్లి:  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో సందేశం పోస్టుచేశారు.

`చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజ‌యానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు` అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.
 

Back to Top