ఎంపీ మిథున్ రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు

హైద‌రాబాద్‌:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డిపై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు కొన‌సాగిస్తోంది. లేని లిక్క‌ర్ కేసులో ఆయ‌న్ను అరెస్టు చేసి జైల్లో పెట్ట‌గా, ఇటీవ‌ల బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. ఈ క్ర‌మంలో మళ్ళీ మిథున్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు సోదాల పేరుతో హ‌డావుడి చేస్తున్నారు. హైదరాబాద్ నివాసంలో మిథున్ రెడ్డి ని సిట్ అధికారులు ప్రశ్నిన్నారు. ఆయ‌న  కార్యాలయాల్లోనూ సిట్ తనిఖీలు చేప‌ట్టింది. ఇప్పటికే అనేక సార్లు మిథున్ రెడ్డి ని విచారించిన సిట్, జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడు కూడా కస్టడీ కి తీసుకుని విచారించింది.  మళ్ళీ మిథున్ రెడ్డి ని కక్ష సాధింపు కోసం సిట్ విచారణ చేప‌ట్ట‌డం రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగానే జ‌రుగుతున్న‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు భావిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ కోరుతూ ఇటీవల కేంద్ర హోంమంత్రి కి మిథున్ రెడ్డి లేఖ రాశారు. సీబీఐ విచారణ డిమాండ్ చేయగానే మళ్ళీ మిథున్ రెడ్డి ని చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేసింది. అమెరికా పర్యటనకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై తీర్పు ఇచ్చే సమయంలో సిట్ సోదాలు చేయ‌డంపై ప‌లు అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.

Back to Top