అంబేద్క‌ర్ జీవితం అంద‌రికీ ఆద‌ర్శం

రాజ్యాంగ రూప‌కర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళులు

తాడేప‌ల్లి: భార‌త రాజ్యాంగ రూప‌కర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం అంద‌రికీ ఆద‌ర్శ‌నీయ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు.  డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ వర్దంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి  పూలమాల వేసి నివాళులర్పించారు. కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్‌, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌ కుమర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌ రావు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు వరికూటి అశోక్‌బాబు, కాకుమాను రాజశేఖర్‌, కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. 

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..

సామాజిక విప్ల‌వ దార్శ‌నికుడు, భార‌త రాజ్యాంగ రూప‌కర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు. ఆయన స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మ‌హాశిల్పాన్ని ఏర్పాటు చేశాం. ఆయన జీవితం అంద‌రికీ ఆదర్శనీయమ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 

Back to Top