జైపాల్‌రెడ్డి మృతికి సీఎం వైయ‌స్‌ జగన్‌ సంతాపం 

అమ‌రావ‌తి:  కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైపాల్‌రెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. జైపాల్‌రెడ్డి మృతితో గొప్ప నాయకున్ని కోల్పోయామని వైయ‌స్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ట్వీట్‌ చేశారు. జైపాల్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

తాజా ఫోటోలు

Back to Top