తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. విజయవాడ వారధి వద్ద ఓ వృద్ధురాలిని బస్సు ఢీకొనడంతో ఆమె రెండు కాళ్లకి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో నిర్మలా శిశువిహార్ నుంచి తాడేపల్లి తిరిగి వస్తున్న వైయస్.జగన్ ప్రమాదం వివరాలు తెలుసుకొని చలించిపోయారు. గాయపడిన వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించే బాధ్యతను ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌కు వైయస్ జగన్ అప్పగించారు. ఎమ్మెల్సీ అరుణ్ 108కు పలుమార్లు ఫోన్‌చేసినా స్పందించకపోవడంతో అటువైపుగా వెళ్తున్న ప్రయివేటు అంబులెన్స్‌లో వృద్ధురాలిని విజయవాడ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించేంతవరకూ ఎమ్మెల్సీ అరుణ్ అక్కడే ఉండి వృద్ధురాలికి సహాయం చేశారు. వైయస్ జగన్ చేసిన సహాయంతో బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.