వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి

వైయ‌స్ఆర్ జిల్లా: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బాణసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగుపాటు ధాటికి ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌  వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయ‌న‌  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంటలు చెలరేగి గాయాల పాలైన బాధితులకు తక్షణమే మైరుగైన వైద్యసదుపాయాలు అందించాలని ప్రభుత్వాన్ని మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ డిమాండ్‌ చేశారు.

Back to Top