సీబీఐ విచారణకు ఎందుకు వెనుకడుగు

 
వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 

జమ్మలమడుగు ఇన్‌చార్జ్‌గా ఉండటం చిన్నాన్న చేసిన తప్పా?

ఓట్లను తొలగించడంతో పాటు మనుషులను కూడా తొలగిస్తున్నారు

ఎన్నికల బాధ్యత నుంచి డీజీపీ, ఇంటలిజెన్సీ ఏడీజీని తప్పించాలి

సీబీఐ విచారణ కోసం కోర్టును ఆశ్రయిస్తాం

హైదరాబాద్‌:  మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి హత్యపై చంద్రబాబు పాత్ర లేకపోతే ఎందుకు సీబీఐ విచారణకు వెనుకాడుతున్నారని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వైయస్‌ వివేకానందరెడ్డి హత్య, రాష్ట్రంలోని రాజకీయ హత్యల గురించి గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌ను కలిసి చిన్నాన్న విషయంలో నిన్న అత్యంత దారుణంగా జరిగిన అంశంలో న్యాయం జరగాలంటే సీబీఐ విచారణ వేయాలని కోరాం. చంద్రబాబు నియమించిన సిట్‌తో ఎలాంటి న్యాయం జరగదని గవర్నర్‌కు చెప్పడం జరిగింది. మేం అక్కడ ఎస్పీతో మాట్లాడుతుండగానే అడిషనల్‌ డీజీ ఇంటిలిజెన్సీ నుంచి ఫోన్లు ఎస్పీకి వచ్చాయి. ఏబీ వెంకటేశ్వర్లు టీడీపీకి ఇంటిలిజెన్సీని వాచ్‌మెన్‌ వ్యవస్థగా మార్చారు.

టీడీపీ తరఫున గ్రామాల్లో విచారణ చేసి వైయస్‌ఆర్‌సీపీ నేతలను ఎలా ప్రలోభపెట్టాలో నివేదికలు అధికార పార్టీకి ఇస్తున్నారు. రాష్ట్రంలో ఏదైనా అసాంఘీక చర్యలు జరిగితే విచారణ చేయాల్సిన ఇంటలిజెన్సీ వ్యవస్థను వాచ్‌మన్‌లా చంద్రబాబు వాడుకుంటున్నారు. మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కార్యక్రమంలో చంద్రబాబు తరఫున ఏబీ వెంకటేశ్వర్లు పిలిచిపించుకొని, మరో పేపర్‌ యజమాని మాట్లాడి పార్టీ మార్పించారు. అలాంటి ఏబీ వెంకటేశ్వర్లు నిన్న ఎస్పీతో మాట్లాడుతుంటే ..ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి రెండుసార్లు ఎంపీగా పని చేశారు. దివంగత ముఖ్యమంత్రి తమ్ముడు చనిపోతే రాష్ట్రంలో లా అండ్‌ అర్డర్‌ ఉందా? జమ్ములమడుగు నియోజకవర్గానికి చిన్నాన్న ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఆయన చేసిన తప్పేంటే. ఆదినారాయణరెడ్డి మా పార్టీ నుంచి గెలిస్తే..చంద్రబాబు డబ్బులు పెట్టి కొని తన పార్టీలో చేర్చుకున్నారు.

ఇప్పుడు కొత్త వ్యక్తిని మా పార్టీ నుంచి తీసుకున్నాం. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం వివేకానందరెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియమించాం. చంద్రబాబు ఇన్‌వాల్వ్‌మెంట్‌ లేకపోతే ఎందుకు సీబీఐ విచారణకు ముందుకు రావడం లేదు. చనిపోయిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, నాలుగు సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తిని పథకం ప్రకారం హత్య చేస్తే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న డీజీపీ, అడిషనల్‌ డీజీ వెంకటేశ్వర్లును ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలి. ఎన్నికల్లో గెలవడానికి ఇప్పటికే ఓట్లను తొలగించారు. ఆ తరువాత మనుషులను కూడా చంపేస్తున్నారు. ఇటువంటి వారు ఉంటే రాష్ట్రంలో ఎన్నికలు జరుగవు. వీరిని తప్పించాలని కోరాం. ఈ విషయంలో కోర్టుకు కూడా వెళ్తాం. ఇంత పెద్ద వ్యక్తి ^è నిపోయాడు. అందరూ కూడా ఆలోచన చేయాలి. సీబీఐ విచారణ లేదా థర్డ్‌ పార్టీ ఎంక్వైరీకి అందరూ సహకరించాలని కోరుతున్నాను. చిన్నాన్నకు సెక్యూరిటీ ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన సౌమ్యుడు. ఆయన ఎక్కడికైనా కూడా ఒక్కడే వెళ్తారు. అంత మంచి వ్యక్తికి కూడా ఇలాంటి పరిస్థితి రావడం అందరికి కన్న బాధాకరం.

చంద్రబాబు వ్యవహరశైలీ ఎలా ఉందంటే..వాళ్లే హత్యలు చేయిస్తారు. వాళ్లే దొంగ దొంగ అంటారు. గతంలో మా తాత రాజారెడ్డిని హత్య చేశారు. తరువాత మా నాన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి అసెంబ్లీలో ఆగస్టు 31న నీవు..అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు బెదిరించారు. ఆ తరువాత రెండు రోజులకు హెలికాప్టర్‌ క్రాస్‌ అయ్యింది. నాపై కూడా హత్యాయత్నం జరిగింది. కత్తి ఎయిర్‌పోర్టులోకి ఎలా వచ్చింది. కారణం అక్కడ పని చేస్తున్న వ్యక్తి టీడీపీకి చెందిన నాయకుడి రెస్టారెంట్‌లో పని చేస్తున్న వ్యక్తి కత్తితో లోపలికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. నిన్న చిన్నాన్న వైయస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పుడు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతి వేలు కూడా చంద్రబాబు వైపే చూపుతోంది. ఆ ఎంక్వరీ తనకు రిపోర్టు చేసే సంస్థతో చేయిస్తే న్యాయం జరుగుతుందా? 
దేవుడు చూస్తున్నాడు. రాక్షసత్వం హద్దులు దాటితే దేవుడు మొట్టికాయలు వేస్తాడన్న నమ్మకం ఉంది.   

 

 

Back to Top