పులివెందులలో ప్రజాదర్బార్ ప్రారంభం

వినతులు స్వీకరిస్తున్న మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌

వైయ‌స్ఆర్ జిల్లా:  పులివెందుల‌లో  ప్రజాదర్బార్‌ కార్యక్రమం కొద్దిసేప‌టి క్రితం ప్రారంభ‌మైంది. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ ఏర్పాటు చేశారు. క్యాంపు ఆఫీసుకు వచ్చిన ప్రజల నుంచి వైయ‌స్ జ‌గ‌న్ వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు.  వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసేందుకు రాయలసీమ జిల్లాలు నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు.

Back to Top