రైతు చిరునవ్వు చిందించే పాలన అందిస్తా

మైదుకూరు ప్రచార సభలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

చంద్రబాబు పాలనలో అడుగడుగునా మోసాలే

పసుపు రైతుకు క్వింటాల్‌కు రూ. 5 వేలు దక్కని దుస్థితి

సీమలో కరువు లేకుండా చేయాలన్నది మహానేత కల

వైయస్‌ఆర్‌ నిర్మించిన ప్రాజెక్టులకు నీరు అందించడం లేదు

డీఎల్‌ రవీంద్రారెడ్డి పార్టీలో చేరడం సంతోషంగా ఉంది

మైదుకూరు: కరువు సీమలో రైతుల కష్టాలు తీర్చాలని దివంగత మహానేత, నాన్నగారు వైయస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు తీసుకొచ్చారు. పూర్తయిన ప్రాజెక్టుల్లో నీరు లేక అల్లాడుతున్నాయి. చంద్రబాబు పాలనలో రైతులు అలమటిస్తున్నారు. ఈ పరిస్థితులు మారాలి. రైతులు చిరునవ్వులు చిందించే పాలన అందిస్తానని మైదుకూరు ప్రచార సభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. పాదయాత్రలో ప్రతి కష్టాన్ని చూశానని, ప్రతి బాధను విన్నానని, మీ అందరికీ తోడుగా ఉంటానని భరోసా కల్పించారు. మైదుకూరు ప్రచార సభలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. 

3648 కిలోమీటర్ల నా పాదయాత్ర జరిగింది. ఇదే మైదుకూరు నియోజకవర్గం గుండా ఆ పాదయాత్ర సాగింది. అంతపెద్ద పాదయాత్ర చేయగలిగాను అంటే దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో జరిగిందని గర్వంగా చెప్పగలుగుతా.. నా పాదయాత్రలో మీ కష్టాన్ని నేను విన్నాను. మీ ప్రతి బాధను నేను చూశాను. ప్రతి అడుగులోనూ ప్రతి కుటుంబం ఏమనుకుంటుందో తెలుసుకున్నాను. మీ అందరికీ ఒక మాటిస్తున్నాను.. ఐదు సంవత్సరాల ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందేమోనని ఎదురుచూస్తూ.. ఆ సాయం ఎండమావి అయి బాధల్లో ఉన్న ప్రతి కుటుంబానికి చెబుతున్నాను.. మీ బాధలు విన్నాను.. మీ కష్టాన్ని చూశాను. మీ అందరికీ నేను ఉన్నానని మాటిస్తున్నా.. 

గిట్టుబాటు ధరలు అందక రుణమాఫీ కాక, కరువు వచ్చినా ఏమాత్రం పట్టించుకొని పరిస్థితుల మధ్య రైతులు బాధలు విన్నా.. కష్టాలు చూశా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలు పడుతున్న ఆవేదన చూశా.. పూర్తి ఫీజురియంబర్స్‌మెంట్‌ అందక చదువులు మధ్యలోనే ఆపేస్తున్న పిల్లల గాథలు విన్నా.. పూర్తి ఫీజురియంబర్స్‌మెంట్‌ రాక చదివించాలంటే అప్పులపాలయ్యే తల్లిదండ్రులు బాధలు విన్నా. చివరకు అప్పులు తీసుకొచ్చి చదివిస్తున్న పరిస్థితులు తెలిసి ఆ బాధను తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్య చేసుకున్న దీనస్థితిని విన్నా.. 108 వచ్చి సకాలంలో వచ్చి ఉంటే ప్రాణాలు మిగిలేవని చనిపోయిన ఆ కుటుంబాలు చెప్పిన మాటలు విన్నా.. ఆరోగ్యశ్రీ సరిగ్గా వర్తించక పక్షవాతం వంటి రోగాలు వచ్చి మంచానికే పరిమితమై.. మందుల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తూ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోని పరిస్థితిలో ఉన్నా.. ఆ పేదవాడు పడుతున్న బాధను చూశా. ఆ కష్టాన్ని నేను విన్నా.. మద్యం షాపులు ఎక్కువైపోయి మద్యానికి బానిసలై మొదటి సంతకంతోనే మద్యం షాపులు లేకుండా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ప్రతి గ్రామంలోని వీధి చివరకు మద్యం దుకాణాలు తెరిచిన పరిస్థితిని నేను చూశా. మందు షాపులు ఎక్కువై రాత్రి 7 దాటితే తమ ఇంట్లో ఉన్న ఆడపిల్లలను బయటకు పంపించాలంటే భయపడుతున్న అక్కచెల్లెమ్మల బాధలు విన్నా.. పిల్లలను చదివించాలంటే కూలీకి పోతున్న అక్కచెల్లెమ్మల బాధలు విన్నా.. 

ఇదే నియోజకవర్గంలోని బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టులో అక్షరాల 17 టీఎంసీల నీరు నిల్వ చేసి తెలుగుగంగాకు నీరు అందించాల్సిన ప్రాజెక్టు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2008లోనే 14 టీఎంసీల నీరు స్టోర్‌ చేశాం.. ఈ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో కనీసం 2 టీఎంసీల నీరు కూడా ఏ రోజు చూడలేదన్న రైతుల ఆవేదన విన్నా.. వెలుగోడు నుంచి వచ్చే కాల్వ మొదట 18 కిలోమీటర్లు ధ్వంసమైంది. కాల్వ లైనింగ్‌కు మరమ్మతులు చేయాలని, బ్రహ్మంసాగర్‌కు నీరు వస్తాయని వేడుకుంటున్నా.. ఎమ్మెల్యేగా రఘురామిరెడ్డి నిరాహార దీక్షకు కూర్చున్న పట్టించుకోని దాఖలాలు చూశా. 

నాన్నగారి హయాంలోనే కరువు సీమకు మేలు చేయడం కోసం ఈ ప్రాంతంలో పంటల కోసం రోజోలి, జలదాసి రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారు. నాన్నగారు బతికి ఉంటే ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయి మొహంలో చిరునవ్వు ఉండేదని ఆ రైతులు చెప్పిన బాధలు విన్నా. గిట్టుబాటు ధర లేక రైతులు పడుతున్న బాధలు చూశా. నాన్నగారి హయాంలో పసుపు రేటు క్వింటాల్‌కు రూ. 16 వేలకు పలికిన రోజులు గుర్తు చేసుకుంటూ ఈ రోజు కనీసం రూ. 5 వేలు కూడా అందడం లేదన్న రైతుల బాధలు విన్నా.. మిర్చి పంటకు కనీసం రూ. 10 వేలు ఉంటే ఖర్చులు అయినా గిట్టుబాటు అవుతాయని ఆవేదనతో చెప్పిన రైతుల మాటలు విన్నా.. ఇవాళ కనీసం రూ. 5 వేలు కూడా రాని పరిస్థితుల్లో ఉన్నామని అన్న మాటలు విన్నా.. అత్యంత నాణ్యమైన కేటీ, కేపీ రకం ఉల్లి ఈ ప్రాంతంలోనే పండిస్తారు. అటువంటి ఉల్లిని రైతులు అమ్మాలంటే.. క్వింటాల్‌కు కనీసం వెయ్యి రూపాయలు కూడా పలకడం లేదు. ఇదే ఉల్లి చంద్రబాబు హెరిటేజ్‌ షాపులో కేజీ రూ. 23కు అమ్ముతున్నారని రైతులు అంటే బాధేసింది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దళారీలకు కెప్టెన్‌గా తయారయ్యాడు. రైతుల పంటలు చేతికి వచ్చే సమయంలో రేట్లు తగ్గించి దళారీల చేతుల్లోకి వెళ్లిన తరువాత, హెరిటేజ్‌ కంపెనీకి వెళ్లిన తరువాత మూడు నాలుగు రెట్లకు ఎక్కువగా అమ్ముకుంటున్నారు. 

ఇదే మైదుకూరు మున్సిపాలిటీలో సీసీ రోడ్లు వేయకుండానే వేసినట్లుగా బిల్లులు తీసుకుంటున్నారు. మరుగుదొడ్లు కట్టకుండానే కట్టినట్లుగా బిల్లులు తీసుకుంటున్నారు. విజిలెన్స్‌ ఎంక్వైరీలను కూడా అడ్డుకుంటున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్థిక మంత్రి యనమల వియ్యంకుడు కావడంతో ఏకంగా పోలవరం ప్రాజెక్టులో సబ్‌ కాంట్రాక్ట్‌ కింద నామినేషన్‌ పద్దతిలో వర్కులు కూడా కట్టబెడుతున్నారు. చంద్రబాబు బినామీ ఎవరంటే మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి. ఇదే మైదుకూరులో చెన్నూరు వద్ద కడప కోఆపరేటివ్‌ షుగర్స్‌ ఫ్యాక్టరీ తెరిపించాలని రైతులు అడుగుతుంటే ఎవరూ పట్టించుకోలేదన్న మాటలు విన్నా.. చివరకు ఆ రైతులు 150 కిలోమీటర్లు వెళ్లి నెల్లూరులోని పొదలకూరులోని ప్రైవేట్‌ ఫ్యాక్టరీకి చెరకును అమ్ముకుంటున్నారు. రవాణా ఖర్చు టన్నుకు రూ. 1200 అవుతుంటే ఎలా గిట్టుబాటు అవుతుందన్నా అన్న రైతుల బాధలు విన్నా.. 

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు. కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ కడతారనే మాట చెప్పారు. ఫ్యాక్టరీ కడితే 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని మన పిల్లలు ఆశగా ఎదురుచూశారు. ప్రత్యేక హోదా కూడా వస్తుంది. ఈ రెండింటి వల్ల ఉద్యోగాలు ప్రతి చోట వస్తాయి. ప్రతి జిల్లా ఒక హైదరాబాద్‌ అవుతుందని ఆశగా ఎదురుచూసిన ఆ పిల్లల పరిస్థితులు చూశా. చదువులు అయిపోయి.. డిగ్రీలు చేతపట్టుకొని కమల్‌నాథన్‌ కమిటీ ప్రకారం 1.40 లక్షల ఉద్యోగాలు వస్తాయని కోచింగ్‌ సెంటర్‌లకు వెళ్లి వేలకు వేల రూపాయలు తగలేస్తున్న ఆ పిల్లల బాధలు విన్నా.. రాష్ట్రం విడిపోయేటప్పుడు 1.40 లక్షల ఉద్యోగాలు, రిటైర్డ్‌ అయిపోయిన వారితో కలిసి 90 వేలు మొత్తం 2.30 లక్షల ఉద్యోగాల్లో ఒక్కటీ ఇవ్వలేదని ఆ పిల్లలు చెబుతున్న మాటలు వింటే బాధ అనిపించింది. రైతులు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు చెప్పిన బాధలు విన్న తరువాత చెబుతున్నా.. మీ ప్రతి బాధ విన్నాను. మీ ప్రతి కష్టం చూశాను.. మీ అందరికీ చెబుతున్నాను.. నేను ఉన్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.. 

మరో 14 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్దం, చేయని కుట్ర, చేయని డ్రామా, చూపని సినిమా కూడా ఉండదని మీరు ఎవరూ మర్చిపోవద్దు. ఇవాళ యుద్ధం ధర్మానికి, అధర్మానికి మధ్య జరగుతుందని ఎవరూ మర్చిపోవద్దు. ఒక్క చంద్రబాబుతోనే కాదు యుద్ధం చేస్తుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో ఇంకా అమ్ముడుపోయిన అనేక టీవీ చానళ్లతో యుద్ధం చేస్తున్నామని మర్చిపోవద్దు. రాబోయే రోజుల్లో చంద్రబాబు కుట్రలు మరింత ఎక్కువ అవుతాయి. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని కుట్ర ఉండదు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపిస్తాడు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల తేదీ వచ్చే సరికి చంద్రబాబు గ్రామాలకు మూటల మూటల డబ్బులు పంపిస్తాడు. ప్రతి చేతిలో రూ. 3 వేలు పెడతాడు. ఇటువంటి కుట్రలను తిప్పికొట్టాలంటే మీరంతా మీ వార్డులకు వెళ్లి ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను, ప్రతి అవ్వను, ప్రతి తాతను, ప్రతి అన్నను కలవండి. 

చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలు తీసుకొని మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్ను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు అన్న ప్రతి అక్క చేతిలో రూ. 15 వేలు పెడతాడని చెప్పండి. మన పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చదివించగలుగుతున్నామా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదు అక్కా.. పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నాం.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను పెద్ద చదువులు ఎన్ని లక్షలు ఖర్చు అయినా అన్న ఉచితంగా చదివిస్తాడని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. 

పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అని చెప్పండి. ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. ఒక్క రూపాయి మాఫీ చేసిన పరిస్థితి లేదు. గతంలో మనకు సున్నావడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత సున్నావడ్డీ ఎగరగొట్టాడు. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఉన్న రుణాలన్నీ మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాడని ప్రతి అక్కకు, ప్రతిచెల్లెమ్మకు చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకి రుణాలు వచ్చేది జగనన్నతోనే సాధ్యమని చెప్పండి.

పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 

గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. 20 రోజులు ఓపికపట్టు అన్న.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబడుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు..  గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 

అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. పెన్షన్‌ వచ్చేది కాదని, లేకపోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. 20 రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 

ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఇల్లు లేదు. కట్టిస్తానన్న మాట పోయింది. 20 రోజులు ఓపిక పట్టు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అక్షరాల 25 లక్షల ఇళ్లులు కట్టిస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యంలో ఇళ్లులు కట్టడం చూశాం. మళ్లీ జగనన్నతోనే అది సాధ్యమని ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి.

నవరత్నాల్లోని ప్రతి అంశం, ప్రతి అక్క, ప్రతి చెల్లె దగ్గరకు చేర్చండి. ప్రతి అవ్వతాతకు, ప్రతి అన్నకు చెప్పండి. నవరత్నాలతో జరిగే ప్రతి మంచి ప్రతి కుటుంబానికి చేర్చండి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పురావాలి. రాజకీయ నాయకుడు మైక్‌ పట్టుకొని పలానా చేస్తానని చెబితే.. అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. అప్పుడే నిజాయితీ వస్తుంది. ఇటువంటి మార్పుకు సహకారం అందించాలి. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాఘురామిరెడ్డి అన్నను నిలబెడుతున్నాను. మీ అందరికీ పరిచయస్తుడే.. సౌమ్యుడు మంచి చేస్తాడని నమ్మకం ఉంది. మీ ఆశీస్సులు అందించాలని కోరుతున్నా.. అలాగే ఎంపీ అభ్యర్థిగా అవినాష్‌రెడ్డిని నిలబెడుతున్నా.. నా తమ్ముడు, యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరి చల్లని దీవెనలు సంపూర్ణంగా నా తమ్ముడికి, రఘురామిరెడ్డికి ఇవ్వాల్సిందిగా పేరు పేరునా ప్రార్థిస్తున్నాను. మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు.  అదే విధంగా డీఎల్‌ రవీంద్రారెడ్డి పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top