విశాఖ: క్షేత్రస్థాయిలో మహిళా స్వయంశక్తి సంఘాలకు అన్ని విధాలా చేదోడువాదోడుగా ఉంటున్న వెలుగు వీవోఏల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపింది. ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వీవోఏలపై కరుణ చూపింది. వారి కృషిని గుర్తించి.. జీవితాల్లో కొత్త వెలుగు నింపే నిర్ణయం తీసుకుంది. వారికిస్తున్న గౌరవవేతనాన్ని రూ.3 వేల ఏకంగా రూ.10వేలు చేసింది. దీంతో ప్రజాసంకల్పయాత్రలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మరో హామీ అమల్లోకి తెచ్చారు. వీవోఏల వేతనం రూ.10 వేలు పెంచుతూ ప్రభుత్వం ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వెలుగు ఉద్యోగులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. థ్యాక్స్ జగనన్న అంటూ నినదిస్తున్నారు. Read Also: ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌ను ప్రారంభం