ఇవాళ మూడు జిల్లాలో వైయ‌స్‌ జగన్‌ ప్రచారం

 అమరావతి: ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే జిల్లాల వారిగా ప్రచారం చేస్తున్న వైయ‌స్‌ జగన్‌.. మంగ‌ళ‌వారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం కోయలగూడెంలో ఉదయం జరిగే బహిరంగ సభలో పాల్గొనన్నారు. ఆ తరువాత మధ్యాహ్నాం 12 గంటలకు కృష్ణా జిల్లా అవనిగడ్డ, 2 గంటలకు గుంటూరు జిల్లా వేమూరులో వైయ‌స్‌ జగన్‌ ప్రచారం చేయనున్నారు.  

Back to Top