హైదరాబాద్: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు, ఓటర్ జాబితాలో అవకతవకలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. సర్వేల పేరుతో వైయస్‌ఆర్ సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని గవర్నర్‌కు వైయస్ జగన్ ఫిర్యాదు చేశారు. పోలీస్ ఆఫీసర్ల పదోన్నతుల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. 60 లక్షల నకిలీ ఓట్లు చేర్చారని, వాటిని వెంటనే తొలగించాలని కోరారు. జననేత వెంట పార్టీ సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. ఏపీ ప్రభుత్వం దొంగ సర్వేల పేరుతో వైయస్‌ఆర్ సీపీ అనుకూల ఓట్లను తొలగిస్తుందని, దాదాపు 4 లక్షల ఓట్లను తొలగించిందని, అంతేకాకుండా సుమారు 60 లక్షల దొంగ ఓట్లను జాబితాలో చేర్చిందని, చర్యలు తీసుకోవాలని వైయస్ జగన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.