సత్యమేవ జయతే 

సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై వైయ‌స్ జగన్ హర్షం 
 

తాడేపల్లి: సవీంద్ర(Savindra) కేసును సీబీఐ(CBI)కి అప్పగించటంపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన సుమోటో ఆదేశాలను తాను స్వాగతిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే హ్యాష్ ట్యాగ్‌తో ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. హైకోర్టు నిర్ణయం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితికి‌ నిదర్శనమన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. 

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..
‘‘ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. సెక్షన్ 111ని దుర్వినియోగం చేయటం నిత్యకృత్యంగా మారింది. సరైన విచారణ, ప్రజల హక్కుల పరిరక్షణ అవసరాన్ని కోర్టు ఆదేశాలు తేటతెల్లం చేశాయి’’ అని వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Back to Top