రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

పొట్టిశ్రీ‌రాములుకు వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళి

తాడేప‌ల్లి:   ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాటుకు అలుపెర‌గ‌ని పోరాటం చేసిన అమ‌ర జీవి పొట్టి శ్రీ‌రాములుకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో ఆయ‌న ట్వీట్ చేశారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..
పొట్టి శ్రీరాములు గారి అహింసా దీక్షతో, ప్రాణత్యాగంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ఆత్మగౌరవంకోసం అలుపెరగని పోరాటం చేశారాయన. పొట్టి శ్రీరాములుగారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని జరపకుండా చంద్రబాబు గారి ప్రభుత్వం చారిత్రక తప్పిదాలకు పాల్పడుతూనే ఉంది. పొట్టి శ్రీరాములుగారి త్యాగాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే. రాష్ట్ర అవతరణ దినోత్సవం రాజకీయాలకు అతీతంగా జరగాలి.

Back to Top