జ‌ర్న‌లిజ‌మంటే చంద్ర‌బాబు ప్ర‌యోజ‌న‌మా?

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

జర్నలిజానికి తూట్లు పొడుస్తున్న మీరు మనుషులేనా..?

 ఐదేళ్ల టీడీపీ మోసాలు ఎల్లోమీడియాకు కనపడడం లేదా..?

లోక్‌నీతి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ముఖంపై ఉమ్మేసింది

అయినా సిగ్గులేకుండా రోజూ అబద్ధాలు ప్రచురిస్తున్నాడు

 
గుంటూరు: జ‌ర్న‌లిజ‌మంటే చంద్ర‌బాబు ప్ర‌యోజ‌న‌మా అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. జ‌ర్న‌లిజానికి తూట్లు పొడుస్తున్న మీరు మ‌నుషులేనా అని నిల‌దీశారు. చంద్ర‌బాబును భుజాన మోస్తూ విలువ‌లు దిగ‌జార్చుతున్నార‌ని మండిప‌డ్డారు. స‌త్తెన‌ప‌ల్లిలో నిర్వ‌హించిన ప్ర‌చార స‌భ‌లో ఎల్లో జ‌ర్న‌లిజాన్ని తూర్పార‌బ‌ట్టారు. వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ..రాష్ట్రంలో అన్యాయమైన పాలన కనిపిస్తున్నా.. ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నా.. ఎల్లోమీడియాకు, చంద్రబాబుకు మాత్రం అంతా సుఖంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యంగా జర్నలిజానికి ఎల్లో మీడియా తూట్లు పొడుస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. క్రిమినల్‌ మైండ్‌ సెట్‌తో కొందరు పత్రికాధిపతులు, చానళ్ల యజమానులు వ్యవహరిస్తున్నారని, ప్రజల బాధలు వారికి ఆనందంగా కనిపిస్తున్నాయన్నారు. చంద్రబాబును భుజాన మోస్తూ.. వైయస్‌ఆర్‌ సీపీపై రోజుకో దుష్ప్రచారం చేస్తూ చర్చలు పెడుతున్నారన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి సభలో వైయస్‌ జగన్‌ ఎల్లమీడియాపై ధ్వజమెత్తారు. జననేత ఏమన్నారో ఆయన మాటల్లోనే.. 

రోజు నాలుగు దుష్ప్రచారాలు చేసినా జనం నమ్మడం లేదన్న భయం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ముఖంలో, చంద్రబాబు ముఖంలో కనిపిస్తుంది. చంద్రబాబుకు అధికారం వచ్చేస్తుంది లోక్‌నీతి, సీఎస్‌డీఎస్‌సీ సర్వే అని ఒక సర్వే వేసి నాలుగు రోజుల కిందట ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మొదటి పేజీలో కొండంత అబద్ధాన్ని వండివార్చి బ్యానర్‌ ఐటమ్‌గా చేశాడు. అలాంటి సర్వే మేము చేయలేదని, అదే లోక్‌నీతి సంస్థ ఛీకొట్టి రాధాకృష్ణ ముఖంలో ఉమ్మేసింది. అయినా సిగ్గులేకుండా తుడిచేసుకొని మళ్లీ రోజూ ఇంకో అబద్ధాన్ని తయారు చేస్తున్నారు. 

విశాఖలో ఒక గర్భిణీ స్తీ్ర మీద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ వాళ్లు అమానుషంగా హింసించారని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో బ్యానర్‌ స్టోరీగా వేశారు. చంద్రబాబు వారం రోజుల పాటు ఇదే విషయాన్ని మాట్లాడుతాడు. ఈ సంఘటనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అక్కడి పోలీసులు స్పష్టంగా చెప్పినా.. ఏ మాత్రం సిగ్గులేకుండా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ని, టీవీ9ను, అమ్ముడుపోయిన ఎల్లోమీడియా పత్రికలను చూస్తే ఎలా ఉందంటే బంగారం కంటే బొగ్గే అందంగా ఉందని చెప్పగలుగుతారు. నెమలికంటే కాకి అందంగా ఉందని చెప్పగలుగుతారు. ప్రపంచంలో అందరికంటే అందగాడు చంద్రబాబే అని చెప్పగలుగుతారు ఈ అన్యాయస్తులు. 

ఈనాడు రోజుకు నాలుగు పేజీలు ఎడాపెడా రాస్తుంది. కాకి పిల్ల కాకికే ముద్దు అన్నట్లుగా తయారయ్యారు. ఎల్లో మీడియాను, చంద్రబాబును అడుగుతున్నా.. ఎల్లో మీడియా పత్రికాధిపుతులు అయ్యా ఎల్లో మీడియా గారూ.. జన్మభూమి కమిటీలతో గ్రామాలను దోచేసిన చంద్రబాబు అంటే ఎందుకంత ప్రేమ. రైతుల రుణాలను మొదటి సంతకంతోనే బేషరుతుగా మాఫీ చేస్తానని ఐదేళ్ల క్రితం హామీ ఇచ్చి ఈ ఐదేళ్లలో రైతులందరికీ అన్యాయం చేసిన చంద్రబాబు అంటే ఎందుకింత ప్రేమ అని అడుగుతున్నా. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను, వాళ్లకు ఉన్న రూ. 14,205 కోట్ల రుణాలను మొదటి సంతకంతోనే మాఫీ చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా.. ఇప్పుడా రుణాలు వడ్డీలతో కలిపి అక్షరాల రూ. 28 వేల కోట్లకు ఎగబాకుతుంటే ఇంతటి దారుణాలు చేసిన ఈ వ్యక్తిపై ఎందుకింత ప్రేమ అని అడుగుతున్నా.. ప్రతి ఇంటికి రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, జాబు రావాలంటే బాబు రావాలన్నాడు.. జాబు ఇవ్వకుంటే రూ. 2 వేల భృతి అన్నాడు.  ఈ ఐదేళ్లలో ప్రతి ఇంటికి 60 నెలలకు రూ. 1.20 లక్షలు ఎగ్గొట్టాడు. అంతేకాకుండా 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులను వలసబాట పట్టించాడు. 

ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి చదువుకున్న పిల్లలను పూర్తిగా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని భుజాన మోస్తున్న ఎల్లో మీడియాకు ఎందుకంత ప్రేమ అని అడుగుతున్నా.. 2014 ఎన్నికల ప్రణాళికలో అక్షరాల 650 హామీలను పూర్తిగా ఎగరగొట్టి మేనిఫెస్టో ఎక్కడ ఉందని టీడీపీ వెబ్‌సైట్‌లో వెతికితే.. కనిపించకుండా మాయం చేసిన ఇటువంటి వ్యక్తిపై ఎందుకింత ప్రేమ అని అడుగుతున్నా.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశారు. కాంట్రాక్టర్లను, మట్టిని, ఇసుకను, బొగ్గు కొనుగోలు, కరెంటు కొనుగోలు, రాజధాని భూములు, విశాఖ భూములు, చివరకు దళితులు, దేవాలయ భూములు వదలకుండా విచ్చలవిడిగా అవినీతి చేస్తే ఆ అవినీతి గురించి ఒక్కరోజు అయినా రాశారా.. చూపారా..? ఇటువంటి పేపర్లు, చానళ్లు నీతి గురించి, నిజాయితీ గురించి ఇటువంటి వ్యక్తులు మాట్లాడుతుంటే ఇంతకంటే సిగ్గుమాలిన పని ఎక్కడైనా ఉంటుందా.. జర్నలిజం అంటే చంద్రబాబు ప్రయోజనమా..? లేక చంద్రబాబు ద్వారా మీ ప్రయోజనమా..? లేక జర్నలిజం అంటే ప్రజల ప్రయోజనమా..? ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకొని ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి మోసపూరిత రాతలు రాసేందుకు మీకు మనసు ఎలా వస్తుందని అడుగుతున్నా.. ఎల్లో మీడియా పెద్దలను. 

చంద్రబాబు చేయించిన నేరాలను కూడా మాపైకే నెట్టేస్తూ క్రిమినల్‌ మైండ్‌ సెట్‌తో జర్నలిజాన్ని తూట్లు పొడుస్తూ కలం పట్టుకున్న మీరు అసలు మనుషులేనా.. ఈ ఐదు సంవత్సరాల దుష్టపాలన మీకు అందంగా కనిపిస్తుందా.. మనుషుల బాధలు మీకు ఆనందాన్ని కలిగిస్తుంటే.. నిజాలకు మీరు పాతర వేస్తుంటే ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్న చంద్రబాబు మాటలు మీకు ఇంపుగా కనిపిస్తుంటే. నాయీ బ్రాహ్మణులను, మత్య్సకారులను, కాపులను అవమానించిన విధానం మీకు కనుసొంపుగా కనిపిస్తుంటే.. కాల్‌మనీ వ్యవహారం నుంచి వనజాక్షికి జరిగిన అవమానం నుంచి సింగపూర్‌ దొంగ కంపెనీలకు బాబు కట్టబెట్టిన భూముల నుంచి రాజధాని భూ కుంభకోణం నుంచి దళితుల భూములు లాక్కోవడం నుంచి లక్షల కోట్ల అవినీతికి పడగలెత్తిన బాబు సామ్రాజ్యం నుంచి ఓటుకు కోట్లు ఇస్తూ దొరికిపోయినా అడ్డగొలుగా మోస్తున్న మీ వైనం, హైదరాబాద్‌ నుంచి రాష్ట్రానికి పారిపోయి వచ్చిన నాటి నుంచి ప్రత్యేక హోదాను తాకట్టపెట్టడం నుంచి బావమరిది మృతదేహం వద్ద శవ రాజకీయాలు దగ్గర నుంచి ప్రతి ఒక్కటీ ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి గమనించమని అడుగుతున్నా.. ఇటువంటి పత్రికలు, ఇటువంటి టీవీలు ఈ రోజు రాష్ట్రాన్ని నడుపుతున్నాయి. చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే బాబుకు డిపాజిట్లు కూడా రావూ అని తెలిసి. ప్రతి రోజూ ఒక పుకారు పుట్టించి వాటిపై చర్చ జరపాలని, ఆ చర్చ ద్వారా ప్రజలను మభ్యపెట్టాలని ఇంత మంది కుతంత్రాలు పన్నుతున్నారు. 

 

Back to Top