ఉత్తరాఖండ్‌ వరదలపై వైయ‌స్ జగన్ దిగ్భ్రాంతి 

తాడేప‌ల్లి: ఉత్తరాఖండ్‌ వరదలపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.  
ఈ మేరకు బుధవారం ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.  `వరద బాధితులను ప్రభుత్వం త్వరగా ఆదుకోవాలి. బాధితులకు వెంటనే పునరావాసం కల్పించటంతోపాటు, తగిన సహాయ చర్యలను చేపట్టాలి’అని వైయ‌స్ జ‌గ‌న్‌ కోరారు. 

Back to Top