తాడేపల్లి: అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కుటుంబ సభ్యులను వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. జయప్రకాష్ కుమారుడు తిరుమలేష్‌తో శనివారం వైయస్ జగన్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ శాసనసభ్యులుగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్ తనదైన ముద్రవేసుకున్నారని జగన్ అన్నారు. జయప్రకాష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. అడుసుమిల్లి జయప్రకాశ్(72) ఊపిరితిత్తుల సమస్యతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను1952లో ఈయన జన్మించారు. భార్య పద్మ, కుమారుడు శ్రీతిరుమలేష్, కుమార్తె సాయినందన ఉన్నారు. 1983-1985 మధ్య విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా అడుసుమిల్లి కొనసాగారు. రాష్ట్రవిభజన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.