రియాక్టర్‌ పేలుడు ఘటన మృతుల కుటుంబాలకు వైయ‌స్ జ‌గ‌న్‌ సంతాపం

 

తాడేప‌ల్లి: అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో రియాక్టర్‌ పేలుడు ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వైయ‌స్ జ‌గ‌న్ డిమాండ్‌ చేశారు.  అగ్ని ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఫ్యాక్టరీలలో కార్మికుల భధ్రతకు అవసరమైన పూర్తిస్ధాయి జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని వైయ‌స్‌ జగన్‌ సూచించారు. 

Back to Top