రైతుల చిరకాల కోరిక నెరవేరబోతోంది

వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంట్‌ సభ్యులు వైయస్‌ అవినాష్‌రెడ్డి
 

వైయస్‌ఆర్‌ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన శంకుస్థాపనలతో రైతుల చిరకాల కోరిక నెరవేబోతుందని కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. రాజోలి రిజర్వాయర్, జోలదరాశి రిజర్వాయర్, కుంధూ నుంచి తెలుగుగంగ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపనలు చేసిన సీఎం వైయస్‌ జగన్‌కు రైతులందరి తరుఫున ధన్యవాదాలు తెలిపారు. బహిరంగ సభలో ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఏడాది కేసీ కెనాల్‌ నీరు విడుదల చేయాలంటే.. మైదుకూరు నాలుగు రోడ్ల సర్కిల్‌లో ధర్నా చేయాల్సిన పరిస్థితి ఉండేదని, బ్రహ్మంసాగర్, ఎస్‌ఆర్‌ 1, ఎస్‌ఆర్‌ 2కి నీరు కావాలంటే కర్నూలులో జరిగే ఐఏబీలో ప్రతి ఏడాది వెలుగోడు నుంచి వచ్చే కాల్వను వెడల్పు చేయండి ప్రతీ ఏడాది అడిగేవాళ్లమని గుర్తు చేశారు. కానీ, ఏ ఒక్క సంవత్సరం కేసీ కెనాల్, తెలుగుగంగ ఆయకట్టు గురించి గత ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదన్నారు. రాజోలి ఆనకట్ట నిర్మించాలని, కేసీ ఆయకట్టును స్థిరీకరించాలని గత ప్రభుత్వ హయాంలో వందలాది ట్రాక్టర్లలో తరలివెళ్లి కడప కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశామని, అయినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కానీ, మన వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం వైయస్‌ జగన్‌ అన్న ఆరు నెలల్లోనే రాజోలి, జోలదరాశి రిజర్వాయర్లు, కుంధూ నుంచి తెలుగుగంగకు ఎత్తిపోతల పథకానికి పెద్ద ఎత్తున శంకుస్థాపనలు చేశారన్నారు. దీంతో బనగానెపల్లె, ఆళ్లగడ్డ, మైదుకూరు, బద్వేల్, కమలాపురం, ప్రొద్దుటూరు, కడప ఇన్ని నియోజకవర్గాలకు మేలు జరగబోతుందన్నారు. రైతులందరి చిరకాల కోరిక తీరుస్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజే శారు. 

   
Back to Top