మత్స్యకారులకు సీఎం వైయ‌స్  జగన్‌ శుభాకాంక్షలు

 అమరావతి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో డీజిల్‌పై సబ్సిడీ నుంచి మత్స్యకార భరోసా వరకు వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

‘‘మత్స్యకార సోదరులందరికీ శుభాకాంక్షలు. డీజిల్ సబ్సిడీ నుంచి మత్స్యకార భరోసా వరకూ, కొత్త హార్బర్ల నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు అందించడంలోనూ ఈ ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా నిలిచింది. ఇక పైనా మీ సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది.’’ అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ట్వీట్‌ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top