సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో మ‌హిళా మంత్రులు

శ్రీ‌కాకుళం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్రారంభించిన‌ "సామాజిక న్యాయ భేరి బ‌స్సు యా త్ర‌లో రాష్ట్ర మ‌హిళా మంత్రులు తానేటి వ‌నిత‌, ఉషాశ్రీ చ‌ర‌ణ్‌, విడుద‌ల ర‌జిని, మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఇవాళ ఉద‌యం  శ్రీకాకుళం నుంచి మొద‌లైన బ‌స్సు యాత్ర‌లో మ‌హిళా మంత్రులు వైయ‌స్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌ను, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు. సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంది పలికార‌ని మ‌హిళా మంత్రులు పేర్కొన్నారు. వైయ‌స్ జగన్ గారికి ఉన్న విశాల దృక్ఫథం వల్లే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం బదిలీ జరిగింద‌న్నారు.  శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు, నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే సామాజిక భేరి బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ గారి కేబినెట్ లోని మొత్తం 25 మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు పాల్గొంటున్నార‌ని చెప్పారు. గ్రామ స్థాయి వాలంటీర్ నుంచి రాజ్యసభ సభ్యుల వరకు ఎక్కడ చూసినా, చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది అని ఈ సందర్భంగా మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు చాటి చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే ఏ ఒక్క రాష్ట్రంలోనూ జరగనంత సామాజిక న్యాయం వైయ‌స్ జగన్ గారి వల్ల, వైయ‌స్ జగన్ గారి చేత, పేద వర్గాలన్నింటి కోసం జరిగిందని వారు కొనియాడారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ గారి వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యాపరంగా సామాజిక న్యాయం జరుగుతుందని, దేశానికే ఇది మార్గదర్శకంగా నిలుస్తోందని మ‌హిళా మంత్రులు పేర్కొన్నారు.  యాత్ర ప్రారంభానికి ముందు శ్రీకాకుళం సెవెన్‌ రోడ్స్‌ జంక్షన్‌లో దివంగత మహా నేత  వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి గారి విగ్ర‌హానికి మంత్రులు అందరూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 

Back to Top