విజయవాడ: రాజధాని ప్రాంత రైతులకు సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేస్తారని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. జీఎన్‌రావు కమిటీ అన్ని జిల్లాలు పర్యటించి ప్రజాభిప్రాయాలు సేకరించిన తరువాతే నివేదిక ఇచ్చిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని జీఎన్‌రావు కమిటీ నివేదిక చెప్పిందన్నారు. అనుభవం పేరుతో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఐదేళ్లు రాజధాని పేరుతో ప్రజలందరినీ మోసం చేశారన్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంత రైతుల నుంచి భూములు లాక్కొని వారిని దగా చేశారన్నారు. అమరావతిలో నాలుగైదు తాత్కాలిక భవనాలు కట్టి గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్యపెట్టారన్నారు. ఇప్పుడు మళ్లీ రాజకీయ కుట్రకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం వైయస్ జగన్ కట్టుబడి ఉన్నారన్నారు.